IPL 2025 All Teams Retentions :2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం రిటెన్షన్ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ శనివారం రిటెన్షన్ కొత్ పాలసీని ప్రకటించింది. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కలిసి ఉంటుంది. ఇక అన్ని జట్లు తాము అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను అక్టోబర్ 30వరకు వెల్లడించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూచించినట్లు సమాచారం.అయితే మెగా వేలానికి ముందు ఆయా జట్లు ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవడం కాస్త కష్టమైన పనే అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారంలో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి అంతా ముంబయి (రోహిత్), చెన్నై (ధోనీ) పైనే ఉంది. ఈ నేపథ్యంలో ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం.
- ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్/అన్షుల్ కాంబోజ్/తిలక్ వర్మ
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్, రజత్ పటీదార్, మాక్స్‌వెల్/కామెరూన్ గ్రీన్, యశ్ దయాళ్
- చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, డారిల్ మిచెల్, మతీషా పతిరణ
- సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, నటరాజన్/భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి
- కోల్‌కతా నైట్ రైడర్స్ : శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, రస్సెల్, నితీశ్ రాణా/హర్షిత్ రాణా
- రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, యజ్వేంద్ర చాహల్/సందీప్ శర్మ
- దిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్, స్టబ్స్, మిచెల్ మార్ష్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్
- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టాయినిస్/మయాంక్ యాదవ్
- గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, షమీ/రాహుల్ తెవాటియా
- పంజాబ్ కింగ్స్: సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసొ రబాడ, లియమ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ