IPL 2024 Top 10 Highest Individual Score :ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl) ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ అంటేనే విధ్వంసకర ఆట. తొలి ఓవర్ తొలి బంతి నుంచే ఎదురుదాడే వ్యూహంగా విధ్వంసకర బ్యాటర్లు చెలరేగిపోతారు. ఇప్పటికీ ఐపీఎల్ 16 సీజ్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 17వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కు చెదరడం లేదు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించిన ఆటగాళ్లు రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. క్రిస్ గేల్ నుంచి గిల్ దాకా తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఉన్న టాప్ టెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.
- క్రిస్ గేల్ - యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే గేల్ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాడంటే బంతులు బౌండరీలు దాటాల్సిందే. నీళ్లు తాగినంత సునాయసంగా గేల్ సిక్సర్లను బాదేస్తాడు. ఐపీఎల్ వచ్చిన తొలి నాళ్లల్లో శతకం సాధించడమే ఒక పెద్ద విషయంగా ఆశ్చర్యకరంగా ఉండేది. కానీ క్రిస్ గేల్ 175 పరుగులతో సునామీ సృష్టించాక ఇది సామాన్యమైపోయింది. తర్వాత చాలామంది విధ్వంసకర ఆటతీరుతో శతకాలు సాధించేశారు. 2013లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ 175 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ అవతలపడేశాడు. ఇప్పటివరకూ ఈ రికార్డును దాటే మొనగాడు రాలేదు.
- బ్రెండన్ మెక్ కల్లమ్ - అది 2008. ఐపీఎల్‌లో అప్పటికీ సెంచరీ అంటే పెద్ద విషయమే. శతకం చేస్తే అందరూ ఆశ్చర్యపోవడమే. అప్పుడే కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన మెక్‌కల్లమ్ బెంగళూరు బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 158 పరుగులతో ఐపీఎల్ శతకం చాలా తేలికని బ్యాటర్లకు అర్థమయ్యేలా చేశాడు.
- క్వింటన్ డికాక్ - గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై డికాక్ 140 పరుగులతో భారీ శతకం సాధించి రికార్డు సృష్టించాడు.
- ఏబీ డివిలియర్స్ - మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. బంతిని మైదానం నలుమూలాల సునాయసంగా ఆడగల విధ్వంసకర ఆటగాడు. అతని షాట్లు చూస్తే మతిపోవాల్సిందే. 2015 ఐపీఎల్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన డివిలియర్స్ ముంబయి బౌలర్లను ఉతికి ఆరేస్తూ 133 పరుగులు చేశాడు.
- కే.ఎల్. రాహుల్ - టీమిండియాలో స్టార్ ఆటగాడిగా ఉన్న కె.ఎల్. రాహుల్ 2020 సీజన్‌లో అద్భుత శతకంతో అలరించాడు. పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన రాహుల్ ఆర్సీబీపై 132 పరుగులతో చెలరేగాడు.
- శుభ్‌మన్ గిల్ - గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో నయా స్టార్ గిల్ చెలరేగిపోయాడు. గుజరాత్ తరపున బరిలోకి దిగిన గిల్ ముంబయిపై 129 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సారి గుజరాత్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న గిల్ బ్యాట్ నుంచి మరికొన్ని ఇన్నింగ్స్‌లు మనం చూడొచ్చు.
- మళ్లీ గేల్ - ఐపీఎల్ 2012 సీజన్‌లో గేల్ మరోసారి తన తడాఖ చూపించాడు. 2012లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ 128 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు.
- రిషభ్ పంత్ - 2018లో జరిగిన ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన పంత్ 128 పరుగులతో సత్తా చాటి తాను ఎంత విలువైన ఆటగాడినో అందరికీ తెలిసొచ్చేలా చేశాడు.
- మురళీ విజయ్ - 2010లో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున బరిలోకి దిగిన మురళీ విజయ్... రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 127 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
- డేవిడ్ వార్నర్ - ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన వార్నర్ కోల్‌కత్తాపై చెలరేగాడు. 126 పరుగులు చేసి సత్తా చాటాడు.