తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానులెవరూ ఊహించనిది - ప్లే ఆఫ్స్ ఆశల పల్లకిలో ఆర్సీబీ - IPL 2024 - IPL 2024

IPL 2024 RCB Play offs : దిల్లీ క్యాపిటల్స్​పై విజయంతో ఆర్సీబీ అభిమానులెవరూ ఊహించని విజయంతో ప్లే ఆఫ్స్​ రేసులోకి వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

RCB
RCB (The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 7:50 AM IST

IPL 2024 RCB Play offs :రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆర్సీబీ విషయంలో అభిమానులెవరూ ఊహించనిది జరిగింది. ఎప్పుడో ఈ జట్టు కథ ముగిసినట్టుగా కనిపించినా ఇప్పుడు అనూహ్యంగా ప్లే ఆఫ్స్​ రేసులోకి వచ్చింది. వరుసగా ఐదో విజయంతో అందుకుని ఫ్యాన్స్​ ఆశలను సజీవం చేసింది.

తాజాగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచులో రజత్‌ పటీదార్‌ మెరుపు బ్యాటింగ్​కు తోడు బౌలర్ల శ్రమ ఉండడంతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్స్​ టేబుల్​లో ఐదొవ పొజిషన్​కు దూసుకెళ్లింది. ఇక ఇదే మ్యాచ్​తో ఏడో ఓటమిని ఖాతాలో వేసుకున్న దిల్లీ జట్టు తన ప్లే ఆఫ్స్​ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ అసాధారణ రీతిలో ఆర్సీబీ పుంజుకున్నప్పటికీ ముందంజ వేయడం ఆ జట్టుకు అంత తేలికేమీ కాదనే చెప్పాలి. ఎందుకంటే చాలా సమీకరణాలే కలిసి రావాలి. కానీ ప్రస్తుతానికి దిల్లీ క్యాపిటల్స్​ కన్నా మెరుగ్గానే ఉంది. 12 పాయింట్లతో సమంగా ఉన్న ఈ రెండు జట్లు చెరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఆర్సీబీ మంచి రన్‌రేట్‌తో ఉంది.

ఇకపోతే ఆర్సీబీ తన చివరి లీగ్ దశ మ్యాచ్​ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ పోరులో మంచి రన్‌రేట్‌తో గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్లతో కాస్త ముందంజ వేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటే లఖ్​నవూ సూపర్ జెయింట్స్ జట్టు తనకు మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క దాంట్లో అయినా ఓటమిని మూట గట్టుకోవాలి. అప్పుడు ఆర్సీబీకి ఇంకాస్త కలిసొస్తుంది.

IPL 2024 Points Table : కాగా, పాయింట్ల పట్టికలో కోల్​కతా నైట్ రైడర్స్​ 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్​ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడు నాలుగు స్థానాల్లో చెరో 14 పాయింట్లతో సన్​రైజర్స్​ హైదరాబాద్​, చైన్నై సూపర్ కింగ్స్ వరుసగా నిలిచాయి.

అక్షర్ పోరాటం వృథా - ఆర్సీబీ ఖాతాలో మరో సూపర్ విక్టరీ - IPL 2024

చెపాక్​లో చెన్నై గెలుపు - పోరాడి ఓడిన రాజస్థాన్ - IPL 2024

ABOUT THE AUTHOR

...view details