IPL 2024 Mumbai Indians 250th Match :హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ మరో ఓటమి మూటగట్టుకుంది. పాండ్యా కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఖాతా తెరవకుండానే వరుసగా మూడు సార్లు ఓడి హ్యాట్రిక్ పరాజయాల పాలైంది. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచులో ముంబయి ఖాతాలో ఓ అరుదైన ఘనత వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన మొదటి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు ఇవే..
ముంబయి ఇండియన్స్ - 250 మ్యాచ్‌లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 244 మ్యాచ్‌లు
దిల్లీ క్యాపిటల్స్ - 241 మ్యాచ్‌లు
కోల్‌కతా నైట్ రైడర్స్ - 239 మ్యాచ్‌లు
పంజాబ్ కింగ్స్ - 235 మ్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్ - 228 మ్యాచ్‌లు
పాండ్యాకు తప్పని విమర్శలు - ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు తగ్గడం లేదు. మామూలుగానే లీగ్ ఆరంభంలో సాధారణ విజయాలు లేదా ఓటములతో మొదలవుతుంది ముంబయి ఇండియన్స్ ఆట. ఈ సీజన్ లోనూ జరుగుతుంది అదే. కాకపోతే వచ్చిన సమస్యల్లా పాండ్యా కెప్టెన్ అవడమే. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో వరుస ఓటములు ఎదురైనా అభిమానులు ఊరకుండిపోయేవారు. కానీ, పాండ్యా కెప్టెన్సీలో లీగ్ ఆరంభం నుంచి బోణీ కూడా కొట్టకపోవడంతో ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 1న ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ వేసే సమయం నుంచి అయిపోయే వరకు పాండ్యాను ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం రోహిత్ పాండ్యకు కాస్త అండగా నిలబడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా వద్దకు బంతి దొర్లగానే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అప్పుడు రోహిత్ జోక్యం చేసుకుని ఆపమని సైగ చేశాడు.
తిట్లకు తగ్గట్టుగానే పాండ్యా -పాండ్యా పర్‌ఫార్మాన్స కూడా ఎగతాళులకు తగ్గట్లుగానే ఉంది. ఆల్‌రౌండర్ అని పేరు తెచ్చుకున్న పాండ్యా క్యాచ్ వదిలేశాడు. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా తన రెండో ఓవర్ బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న బట్లర్ మీదకు అవుట్ సైడ్ ఆఫ్ బంతిని విసరగా అది నేరుగా లెఫ్ట్ మిడాఫ్‌లో ఉన్న హార్దిక్ వైపుగా ఎగిరింది. దానిని పట్టుకునేందుకు రెండు చేతులతో ప్రయత్నించినప్పటికీ బంతి పాండ్యా చేతులలో నుంచి జారిపోయింది. ఇది చూసిన ముంబయి ఫ్యాన్స్ వాంఖడే స్టేడియంలో రెచ్చిపోయారు. పాండ్యాకు వ్యతిరేకంగా స్టేడియం మొత్తం వినిపించేలా కెప్టెన్సీ నుంచి దిగిపొమ్మంటూ గేలి చేశారు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడని, ఆటగాళ్ల మధ్య కోఆర్డినేషన్ సెట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు.
రాజస్థాన్‌తో మ్యాచ్ - ఓడినప్పటికీ ఓ అరుదైన ఘనత సాధించిన ముంబయి - IPL 2024 Mumbai Indians - IPL 2024 MUMBAI INDIANS
IPL 2024 Mumbai Indians 250th Match : రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆ వివరాలు.
రాజస్థాన్‌తో మ్యాచ్ - ఓడినప్పటిhttp://10.10.50.85:6060/finalout4/telangana-nle/thumbnail/02-April-2024/21125301_thumbnail_16x9_mumbai.jpgకీ ఓ అరుదైన ఘనత సాధించిన ముంబయి
Published : Apr 2, 2024, 8:56 AM IST
|Updated : Apr 2, 2024, 10:49 AM IST
Last Updated : Apr 2, 2024, 10:49 AM IST