MS Dhoni Family Christmas Celebrations : క్రిస్మస్ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కుటుంబ సభ్యులకు అలాగే ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శాంతా క్లాజ్ వేషధారణలో భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ సతీమణి నెట్టింట షేర్ చేయగా, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
ధోనీ, జివా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి మ్యాచ్ అయ్యేలా రెడ్, వైట్ కాంబినేషన్‌లో దుస్తులు ధరించారు. వీరితో పాటు బాలీవుడ్ నటి కృతిసనన్, కబీర్ బహియా తదితరులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ధోనీలోని ఈ కొత్త యాంగిల్‌ని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ఫ్యామిలీ, ఇటు క్రికెట్ కెరీర్‌ని మేనేజ్ చేయడంలో ధోనీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
క్రికెట్‌లో ధోనీ భవిష్యత్తుధోనీ క్రిస్మస్ సెలబ్రేషన్లు పక్కనపెడితే, అతడు గ్రౌండ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 మెగా వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.4 కోట్లకు చెన్నై అతడిని సొంతం చేసుకుంది.ధోనీ కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కి మొత్తం ఐదు టైటిల్స్ అందించాడు. చివరిగా 2023లో ఐదో టైటిల్ గెలిచాడు. 2024 ఐపీఎల్ సీజన్‌కి ముందు చెన్నై జట్టు కెప్టెన్సీ వదులుకున్నాడు. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం ఇచ్చాడు. గత సీజన్‌లో ధోనీ కెప్టెన్‌గా కాకుండా సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగాడు. ప్రస్తుతం ధోనీ 2025 ఐపీఎల్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
రిటైర్మెంట్ రూమర్స్
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా ధోనీ రిటైర్మెంట్ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023లో కప్పు గెలిచాక 2024 సీజన్ అతడి చివరిదంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ధోనీ మోకాలికి సర్జరీ జరగడం ఈ ఊహాగానాలకు ఇంకాస్త బలం చేకూరింది. అయితే 2024 తర్వాత కూడా ధోనీ రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల ముగిసిన మెగా వేలంలో చెన్నై సొంతం చేసుకుంది. దీంతో 2025 సీజన్ కోసం ధోనీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
'పదేళ్లుగా ధోనీతో మాటల్లేవ్- మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు!'
భార్యతో కలిసి ధోనీ డ్యాన్స్ - మిస్టర్ కూల్ స్టెప్పులు సూపర్!