Ipl 2024 Opening Ceremony:2024 ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ చెన్నై చిదంబంరం స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. సింగర్ సోనూ నిగమ్ 'వందేమాతం' గేయంతో ఆకట్టుకోగా, రెహమాన్ 'మా తుజే సలామ్' పాటతో స్టేడియంలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ జాకీష్రాఫ్ హుషారుగా స్టెప్పులేశారు. వీరంతా ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఫైర్ వర్క్స్, లైటింగ్ షో ఓపెనింగ్ సెర్మనీని మరింత గ్రాండ్‌గా మార్చాయి.
చంద్రయాన్- 3కి అంకితం: గతేడాది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్‌కు ట్రిబ్యూట్ తెలిపారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ (LM) విజయవంతంగా దిగడంతో, యునైటెడ్ స్టేట్స్, చైనా, మాజీ సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్‌తో భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా అవతరించింది. ప్రపంచ అగ్ర రాజ్యాలను వెనక్కి నెట్టి, అంతరిక్ష రంగంలో ఊహించని విజయాలు అందుకుంటున్న ఇస్రో కృషిని గుర్తించాలని BCCI (బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) భావించింది.