IPL 2024 Mumabi Indians VS Sunrisers Kavya Maran : ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని సాధించింది. అటు ఐపీఎల్ చరిత్రలో ఇటు హౌం గ్రౌండ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఏకంగా 277 పరుగుల భారీ స్కార్ చేసింది. దీంతో ఆర్మెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అభిమానులు కాలర్ ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. స్టేడియం అంతా సన్‌రైజర్స్ పేరుతో మార్మోగిపోయింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అదే సమయంలో స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించిన సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య సంబరపడిన దృశ్యం కూడా అందరినీ కట్టిపడేసింది. ఎందుకంటే తమ తొలి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడినప్పటికీ ఓడిపోయింది. తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య ముభావంగా కనిపించింది. తమ జట్టు బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చిన సమయంలో, బ్యాటర్లు ఔట్ అయిన సందర్భంలో ఆమె చాలా మూడీగా కనిపించింది. జట్టు జెర్సీని, కెప్టెన్సీని మార్చినా కూడా ఫేట్ మాత్రం మారలేదంటూ కావ్య పాపకు నెట్టింట సైటైర్లు కూడా పడ్డాయి.
కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్ చేసిన విధ్వంసానికి కావ్య పాప ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోలేదు. ప్రతి ఫోర్కు, సిక్సర్‌కు సీటులో నుంచి లేచి మరీ కేరింతలు, చప్పట్లు కొడుతూ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్‌లో కూర్చొని రచ్చ రచ్చ చేసింది.