ETV Bharat / entertainment

OG స్పెషల్ సాంగ్- పవర్​స్టార్​తో స్టెప్పులేయనున్న 'రాధిక'! - OG MOVIE SPECIAL SONG

ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్- పవన్​తో ఆడిపాడనున్న భామ ఎవరంటే?

OG Movie Special Song
OG Movie Special Song (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

OG Movie Special Song : పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్​లో జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా నిమిషాల్లోనే అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట.

ఈ స్పెషల్ సాంగ్​లో ఆడిపాడేందుకు యంగ్ బ్యూటీని సంప్రదించారట. ఆమె ఎవరో కాదు డీజే టిల్లు ఫేమ్​ రాధిక (నేహాశెట్టి). పవన్​ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ రాగానే నేహా శెట్టి కూడా ఒప్పేసుకుందట. ప్రస్తుతం బ్యాంకాక్​లోనే ఈ పాట షూటింగ్​ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. మరి హీరో పవన్ కల్యాణ్ భారత్​లోనే ఉన్నారు. దీంతో స్పెషల్ సాంగ్​లో ఆయన ఉంటారా? లేదా నేహా శెట్టితోనే స్టెప్పులేయిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకు లిమిటెడ్ బడ్జెట్ సినిమాల్లో నటించిన నేహా శెట్టికి, పవన్ సినిమాలో అవకాశం రావడం కెరీర్​లో మంచి టర్న్​ అనే చెప్పాలి!

అప్డేట్ అప్పుడే!
ఈ సినిమా నుంచి ఒక్క టీజర్ మినహా ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ రాలేవు. ఈ క్రమంలో ఫ్యాన్స్​కు తొలి పాట వినిపించేందుకు మేకర్స్​ ప్లాన్స్​ చేస్తున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్​ను విడుదల చేస్తారని సమాచారం. అది ఈ స్పెషల్ సాంగే​ అయిఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ కల్యాణ్ 'ఓజాస్‌ గంభీర' అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ నటిస్తున్నారు. బ్యూటీ ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

OG అప్డేట్: ఇప్పటికైతే 'సీజ్​ ది షిప్'- PK ఫ్యాన్​కు మేకర్స్ ఫన్నీ రిప్లై

'బ్లాస్ట్ ది హెలికాప్టర్!' - పవన్ కల్యాణ్ OG లేటెస్ట్ అప్డేట్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.