IPL 2024 Mumbai Indians VS Gujarat Titans :ఐపీఎల్ 2024 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై ముంబయి కెప్టెన్ హార్దిక్ స్పందించాడు.
"చివరి 5 ఓవర్లలో మా విజయానికి 42 పరుగులు అవసరమైన సందర్భంలో 6 వికెట్ల ఉండడంతో సులభంగానే గెలుస్తామని భావించాం. కానీ వరుసగా వికెట్లు పోగొట్టుకున్నాం. నాకు తెలిసి ఇంకాస్త జోరు కొనసాగించాల్సింది. అదే మైనస్. చివరి ఐదు ఓవర్లలో ముంబయి ఇంత తక్కువ స్కోర్ ఛేదించకపోయిన మ్యాచుల్లో ఇదొకటి. అయితే అహ్మదాబాద్‌లో మళ్లి తిరిగి వచ్చి ఆడటం ఆనందంగా ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియంలో వాతావరణం బాగుంటుంది. నేను బాగా ఆస్వాదిస్తాను. పైగా ఈ రోజు మొత్తం అభిమానులతో నిండిపోయింది. గుజరాత్ జట్టు కూడా అద్భుతంగా ఆడింది. అభిమానులందరికి ఈ మ్యాచ్‌తో మంచి మజా లభించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ సింగిల్‌ను తీయకపోవడం సరైన నిర్ణయమే అని భావిస్తున్నాను. అందుకే అతడికి సపోర్ట్‌గా నిలిచాను. ఈ ఓటమి మాకు పెద్ద సమస్య కాదు. ఇంకా మాకు 13 మ్యాచ్‌లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా పుంజుకుంటాం. అని హార్దిక్ పేర్కొన్నాడు.
హార్దిక్‌కు హేళన - రోహిత్‌కు నీరాజనం :రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో హార్దిక్ టాస్ వేయడానికి వచ్చినపుడు స్టేడియంలో ఫ్యాన్స్ అతడిని హేళన చేస్తూ అరిచారు. రోహిత్‌కు మాత్రం జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. హిట్‌మ్యాన్ క్యాచ్ పట్టుకున్నప్పుడు, బ్యాటింగ్ చేస్తున్నపుడు అయితే స్టేడియం హోరెత్తింది.