తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT - IPL 2024 MI VS GT

IPL 2024 MI VS Gujarat Titans : ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ముంబయి ఇండియ‌న్స్‌ ఓట‌మితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ వివాదం జరిగింది. రోహిత్ శర్మ - హార్దిక్ పాండ్య ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. బాగా గొడవపడి కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్
స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:19 AM IST

Updated : Mar 25, 2024, 12:55 PM IST

IPL 2024 MI VS Gujarat Titans :ఐపీఎల్ 2024లో భాగంగాఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. అయితే సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, ముంబయి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన యాజమాన్యం హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కానీ టీమ్ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జట్టులోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో హార్థిక్​ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్​. అయితే భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబయి టీమ్ యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. అయినా కూడా రోహిత్ అభిమానుల ఏమాత్రం చల్లారలేదు.

రోహిత్, రోహిత్ అంటూ నినాదాలు : తాజాగా గుజరాత్ వర్సెస్ ముంబయి మ్యాచ్‌లో కూడా పాండ్యను విపరీతంగా ట్రోల్ చేశారు ఫ్యాన్స్. టాస్ సమయంలో హార్దిక్ పాండ్య పేరును రవిశాస్త్రి పలికినప్పుడు కూడా ఫ్యాన్స్ అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిట్​మ్యాన్​కు కెప్టెన్సీ ఇవ్వాలంటూ మద్దతుగా వచ్చిన చాలా మంది ప్రేక్షకులు రోహిత్, రోహిత్ పేరును అరవడంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ క్రికెటర్​కు ఇంత వ్యతిరేకత గతంలో ఎన్నడూ చూడలేదన్నాడు.

అయితే గుజరాత్-ముంబయి మ్యాచులో ఓ విదాదం చోటు చేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ చూడనికి వచ్చిన ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్, పాండ్య ఫ్యాన్స్ కొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి.

ఇది నిజమేనా? రోహిత్ శర్మ, హార్దిక్​ పాండ్య అభిమానులు స్టేడియంలో కొట్లాటకు దిగారంటూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న నేపథ్యంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. స్టేడియంలో కొట్టుకున్నది రోహిత్-పాండ్య ఫ్యాన్స్ కాదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో స్పష్టత లేదు.

రోహిత్​ అసహనం -మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్, పాండ్యల మధ్య సీరియస్ డిస్కషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రోహిత్ ఎవరితోనే మాట్లాడుతున్న సమయంలో వెనక నుంచి హార్ధిక్​ అతడిని హగ్ చేసుకున్నాడు. కానీ హిట్ మ్యాన్ మాత్రం అసహనంతో హార్దిక్​పై కోప్పడినట్టు వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మ్యాచ్ ఓటమిపై హార్దిక్​తో సీరియస్​గా మాట్లాడుతున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది.

'అదే మా ఓటమికి కారణం - తిలక్ నిర్ణయమే సరైనది' : హార్దిక్ పాండ్య - IPL 2024 MI VS GT

ఉత్కంఠ పోరులో ముంబయిపై టైటాన్స్‌ విజయం - GT VS MI IPL 2024

Last Updated : Mar 25, 2024, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details