IPL 2024 Hardik Pandya Fined :ఐపీఎల్లో హార్దిక్ పాండ్యకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్ 30న లఖ్‌నవూ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దూరమయ్యాయి. అలా ఓటమి, ప్లే ఆఫ ఆశలు గల్లంతు అయిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యకు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. పాండ్యకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ మెగా టోర్నీలో రెండోసారి స్లో ఓవర్ రేట్ వేసినందుకు గానూ రూ. 24 లక్షల జరిమానా విధిస్తూ అనౌన్స్మెంట్ చేసింది.
కేవలం కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మాత్రమే కాదు ముంబయి జట్టులోని ఇతర ప్లేయర్స్‌కు కూడా జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. జట్టులోని ప్లేయింగ్ 11లో ఉన్న వారందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దానిని ప్లేయర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, హార్దిక్ పాండ్య మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురైతే మరింత భారీ జరిమానా విధిస్తారు. దాదాపు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా పడుతుంది.
ఇక ఈ సీజన్లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఈ జాబితాలో పంత్ రెండు సార్లు, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, స్లో ఓవర్ రేట్ జరిమానాను ఎదుర్కొన్నారు.