Ind vs Aus 4th Test 2024 : మెల్బోర్న్ టెస్టు రసవత్తంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 228-9 స్కోర్‌తో ఉంది. క్రీజులో నాథన్ లియాన్ (41 పరుగులు), స్కాట్ బొలాండ్ (10 పరుగులు) తొలి ఇన్నింగ్స్ 105 పరుగుల ఆధిక్యం కలుపుకొని, ఆసీస్ ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్ (70 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా, ప్యాట్ కమిన్స్ (41 పరుగులు) ఆకట్టుకున్నాడు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, మహ్మద్ సిరాజ్ 3, రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బుమ్రా రఫ్పాడించాడు. యంగ్ కుర్రాడు సామ్ కొన్‌స్టాస్ (8 పరుగులు)ను బుల్లెట్ లాంటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ టచ్‌లోకి వచ్చాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (21 పరుగులు)ను ఎల్బీడబ్ల్యూగా, స్టీవ్ స్మిత్ (13 పరుగులు)ను పెవిలియన్ చేర్చాడు. ఇక ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో బుమ్రా మరోసారి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఒకే ఓవర్లో
ఒకే ఓవర్లో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (1 పరుగు), మిచెల్ మార్ష్ (0) ను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు. దీంతో 91 పరుగులకే ఆసీస్ కీలక 6 వికెట్లు కోల్పోయింది. అయితే లబుషేన్- కమిన్స్ పోరాటంతో ఆసీస్ స్కోర్ బోర్డు ముందుగు కదిలింది. లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేసి 57 పరుగుల భాగస్వామ్యాని విడగొట్టాడు. ఆ తర్వాత మిచెస్ స్టార్క్ (5 పరుగులు) రనౌట్ అవ్వగా, కమిన్స్‌ను (41 పరుగులు) జడేజా వెనక్కింపంపాడు.
టెయిలెండర్ల పోరాటం
చివర్లో టెయిలెండర్లు నాథన్ లియాన్ (41), స్కొట్ బొలాండ్ (10) భారత్‌కు అనూహ్య షాకిచ్చారు. భారత బౌలర్లను ఎదురొడ్డి అద్భుతంగా పోరాడుతున్నారు. వీరిద్దరూ 110 బంతులు ఎదుర్కొని 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్‌కు కీలకమైన లీడ్ ఇస్తున్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది.
That's Stumps on Day 4
— BCCI (@BCCI) December 29, 2024
Australia reach 228/9 and lead by 333 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/Gw8NbCljL7
బుమ్రా@ 200- తొలి భారత బౌలర్‌గా రికార్డ్- కెరీర్లో మరో ఘనత
'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు