Best Exercises to Lose Weight Fast : అధిక బరువు ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ కొందరిలో అంతగా మార్పు కనిపించదు! అందుకు కారణం సరైన వ్యాయామాలు ఎంచుకోకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సులువుగా బరువు తగ్గడానికి తోడ్పడే కొన్ని బెస్ట్ ఎక్సర్సైజెస్ సూచిస్తున్నారు. ఇవి వెయిట్ లాస్‌తో పాటు ఇంకెన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయంటున్నారు. ఇంతకీ, ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాకింగ్ : ఎవరైనా, ఎక్కడైనా ఈజీగా చేసే వ్యాయామాలలో ఒకటి వాకింగ్. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ముందుగా స్టార్ట్ చేసినప్పుడు వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట నడవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆపై మీరు మరింత ఫిట్‌గా మారాక మీ నడక వ్యవధి, వేగాన్ని క్రమక్రమంగా పెంచుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రీసెర్చ్‌లో కూడా ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు వారానికి 3 సార్లు 50-70 నిమిషాలు నడవడం వల్ల శరీర కొవ్వు, నడుము చుట్టుకొలత చాలా వరకు తగ్గిందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రన్నింగ్ : బరువు తగ్గడానికి తోడ్పడే మరో చక్కటి వ్యాయామం రన్నింగ్. ముఖ్యంగా ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందట. అయితే, ప్రారంభ సమయంలో వారానికి 3-4 సార్లు 20-30 నిమిషాలు నిదానంగా రన్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆపై వేగం, వ్యవధి పెంచుకోవాలంటున్నారు.
కపుల్ ఎక్సర్‌సైజుతో ఈజీగా బరువు తగ్గచ్చట! మరి ఎలా చేయాలో తెలుసా?
సైక్లింగ్ : ఇది కూడా అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేసే వారు మెరుగైన ఫిట్నెస్ పొందడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందట.
బరువులు ఎత్తడం : ఇది బలాన్ని పెంచడం, కండరాల పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచడంలోనూ బరువులు ఎత్తే వ్యాయామం ఉపయోగపడుతుంది. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అయితే, ముందుగానే అధిక బరువులు ఎత్తకుండా మీ సామర్థ్యానికి తగిన విధం ఎంచుకొని ఆపై పెంచుకోవాలంటున్నారు.
చలికి బరువు పెరుగుతారట మీకు తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చట!
ఈత : ఇదీ శరీర కొవ్వును తగ్గించి బరువు తగ్గించడానికి చాలా బాగా తోడ్పడుతుంది. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ అంచనా ప్రకారం 65 కిలోలు ఉన్న వ్యక్తి మితమైన వేగంతో ఈత కొట్టడం ద్వారా నిమిషానికి 9 కేలరీలు ఖర్చు అవుతాయట. అదే 81 కిలోల వ్యక్తి మితమైన వేగంతో ఈత కొట్టడం ద్వారా నిమిషానికి 11.6 కేలరీలు బర్న్ అవుతాయట. ముఖ్యంగా మీరు ఈత కొట్టే విధానంపై ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
పిలాటిస్ : ఇది బరువు తగ్గడానికి తోడ్పడే మరో చక్కటి ఎక్సర్సైజ్. ఇందుకోసం జిమ్‌కి వెళ్లక్కర్లేదు. కొన్ని చిన్న చిన్న సాధనాలు కొనుక్కొని ఇంటి వద్దే చేసుకోవచ్చు. ఆడామగా ఏ వయసువాళ్లయినా ఈజీగా పిలాటిస్ వ్యాయామం చేయవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రీసెర్చ్‌లో కూడా 30 నుంచి 50 సంవత్సరాలు కలిగిన మహిళలు వారానికి 90 నిమిషాలు 3 సార్లు పిలాటిస్ వ్యాయామాలు చేయడం వలన నడుము, కడుపు, తుంటి చుట్టుకొలత గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ పనుల ద్వారా "పొట్టకింద కొవ్వు" వెన్నలా కరుగుతుందట! - అవేంటో మీకు తెలుసా?