తెలంగాణ

telangana

ETV Bharat / sports

లఖ్​నవూ గెలుపు గుర్రం కోలుకుంది - సీఎస్కే మ్యాచ్​తో బరిలోకి! - Mayank Yadav Injury Update - MAYANK YADAV INJURY UPDATE

Mayank Yadav Injury Update : చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్‌. ఎల్ఎస్‌జీ ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. ట్రైనింగ్‌ సెషన్‌లో ఫుల్‌ పేస్‌లో బౌలింగ్‌ చేస్తున్న వీడియోను ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది.

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 8:01 PM IST

Mayank Yadav Injury Update :ప్రస్తుతం లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌(LSG) పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆడిన 6 మ్యాచ్‌లలో 3 విజయాలు అందుకుంది. లీగ్‌ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన లఖ్​నవూ ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు అందుకొంది. కానీ ఆ తర్వాత గత రెండు మ్యాచ్‌లు కోల్పోయి హ్యాట్రిక్‌ ఓటముల అంచున నిల్చుంది. అయితే రానున్న కీలక మ్యాచ్‌కు ముందు లఖ్​నవూ ఓ అదిరిపోయే న్యూస్‌ షేర్‌ చేసుకుంది. స్పీడ్‌ గన్‌ మయాంక్‌ యాదవ్‌ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపింది.

కేఎల్‌ రాహుల్ నేతృత్వంలోని LSG ఏప్రిల్‌ 19న జరుగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. లఖ్​నవూ హోమ్‌ గ్రౌండ్‌ ఎకానా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది.

  • మయాంక్‌ సంచలన ప్రదర్శన -ఐపీఎల్‌ 2024లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న యంగ్‌ ప్లేయర్స్‌లో మయాంక్‌ యాదవ్‌ ఒకడు. స్థిరంగా 150+ స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 155.8 కిమీ/గం వేగంతో బాల్‌ డెలివరీ చేసి రికార్డు క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత 156.7 కిమీ/గం వేగంతో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

మార్చి 30న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టాడు. ఏప్రిల్‌ 2న ఆర్సీబీ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే ఏప్రిల్‌ 7న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి వరుసగా రెండు మ్యాచ్‌లకు దూరమ్యాడు. దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు.

  • మయాంక్ యాదవ్ తిరిగి రాబోతున్నాడు -తాజాగా మయాంక్‌ యాదవ్‌ గాయం నుంచి కోలుకుని ట్రైనింగ్ సెషన్‌లో LSG ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోని లఖ్​నవూ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు మయాంక్‌ చెన్నై మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అని కామెంట్లు చేస్తున్నారు. మయాంక్‌ దూరమైన రెండు మ్యాచ్‌లు దురదృష్టవశాత్తు లఖ్​నవూ ఓడిపోయింది. మయాంక్‌ రాకతో లఖ్​నవూ గెలుపు బాట పడుతుందని కోరుకుంటున్నారు.
  • మయాంక్‌కు సపోర్ట్‌గా LSG -మయాంక్‌ గాయపడిన తర్వాత లఖ్​నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ స్పందించారు. మయాంక్‌కు చిన్న సమస్య ఉందని, వీలైనంత త్వరగా కోలుకుని మ్యాచ్‌ ఆడుతాడని చెప్పారు. అతన్ని తొందరపెట్టడం ఇష్టం లేదని, పూర్తిగా కోలుకుని వంద శాతం ఫిట్‌గా ఉన్నప్పుడే ఆడిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details