తెలంగాణ

telangana

ETV Bharat / sports

డైహార్డ్​​ ఫ్యాన్స్​ - కోహ్లీ కోసం ఒక్కొక్కరు రూ.53 వేలు పెట్టి స్టేడియానికి! - IPL 2024 Match Tickets Price - IPL 2024 MATCH TICKETS PRICE

IPL 2024 Match Tickets Price : ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌లో నమోదవుతున్న స్కోర్‌లు, సిక్సుల రికార్డులు చూస్తే మతిపోతోంది. అన్ని టీమ్‌లు హోరా హోరీగా పోరాడుతున్నాయి. వీటితోపాటు ఐపీఎల్‌ టిక్కెట్‌ ధరలు కూడా కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి! పూర్తి వివరాలు స్టోరీలో.

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 7:36 PM IST

IPL 2024 Match Tickets Price :క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. లీగ్‌ మొదలై దాదాపు నాలుగు వారాలు పూర్తయింది. 31 మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. ఏకంగా 500 సిక్సర్లు బాదేశారు. ఐపీఎల్ హిస్టరీలో టాప్‌ త్రీ హైయస్ట్ స్కోర్‌లు ఈ సీజన్‌లోనే నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్ జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు మరో రకమైన గణాంకాలు కూడా మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తాయి. అవే ఐపీఎల్ 2024 టిక్కెట్ల ధరలు.

కొన్ని నివేదికల ప్రకారం, IPL టిక్కెట్ ధర రూ.499 నుంచి రూ.52938 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. సీటు, టీమ్‌, కొనుగోలు సమయం, మ్యాచ్‌ జరుగుతున్న వెన్యూ ఆధారంగా ఈ టిక్కెట్‌ రేట్లను నిర్ణయిస్తున్నారు.

  • ఆర్సీబీ మ్యాచ్​కు అత్యంత ఎక్కువగా - ఐపీఎల్‌ టిక్కెట్‌ ధరలను నిర్ణయించే బాధ్యతను బీసీసీఐ ఫ్రాంచైజీలకు వదిలివేయడంతో టిక్కెట్‌ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే, అన్ని టిక్కెట్ల ధరలు అంత ఎక్కువగా ఉండవు. టిక్కెట్‌ ప్రైస్‌లు వెన్యూ, ఫ్రాంచైజీపైన ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు లఖ్​నవూ సూపర్ జెయింట్స్ వంటి టీమ్​లు ఆడే మ్యాచ్‌లకు వీలైనంత త్వరగా బుక్‌ చేసుకున్న వారికి తక్కువ ధరకే టిక్కెట్లు విక్రయిస్తున్నారట. మ్యాచ్‌ దగ్గరపడే కొద్దీ వాటి రేట్లు పెరుగుతాన్నాయి.

అయితేప్రస్తుతం ఐపీఎల్‌లో తలపడుతున్న టీమ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువ. ఈ టీమ్‌ను సపోర్ట్‌ చేయడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలి వస్తుంటారు. అందువల్ల ఆర్సీబీ హోమ్ గేమ్‌ల టిక్కెట్‌లకు భారీ డిమాండ్‌ కనిపిస్తుంది. మ్యాచ్ రోజు దగ్గరపడుతున్న కొన్ని ఖరీదైన సీట్ల రేట్లు పెరుగుతూ పోతాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫస్ట్‌(ఓపెనింగ్​ మ్యాచ్​కు) గేమ్‌కు టెర్రస్ టిక్కెట్ ధర రూ.4,840 నుంచి రూ.6,292కి పెరిగిందట. కార్పొరేట్ స్టాండ్‌ల టిక్కెట్ ధర రూ.42,350 నుంచి రూ.52,938కి చేరిందని తెలిసింది. ఈ మ్యాచ్​లో బెస్ట్‌ సీట్‌, లాస్ట్‌ మినిట్‌లో బుక్‌ చేసివారికి ఏకంగా రూ.52,938కు విక్రయించారట.

తక్కువ ధరకే చెన్నై మ్యాచ్‌ టిక్కెట్లు - అయితే ఈ స్థాయిలో ఉన్న టిక్కెట్‌ల ధరలను ఆయా ఫ్రాంచైజీలు సమర్థించుకుంటున్నాయి. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ - టిక్కెట్లు బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. వాటి వల్ల ఫ్రాంచైజీలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిణామాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. స్టేడియం సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ధరను సర్దుబాటు చేశారు. అంతేకాకుండా, ప్రతి టిక్కెట్‌కు మేము 58 శాతం పన్ను (28% GST, 25% ఎంటర్‌టైన్‌మెంట్‌) చెల్లిస్తాం. కాబట్టి మాకు రాబడులు చాలా తక్కువ అని వివరించారు. చెన్నైలో చౌకైన టిక్కెట్ ధర రూ.1,700గా ఉందని తెలిసింది. అత్యంత ఖరీదైన టిక్కెట్‌ ప్రైస్‌ రూ.6,000. మిగతా అన్ని ఫ్రాంచైజీలు నిర్ణయించిన ధర కన్నా ఇవి చాలా తక్కువ.

రోహిత్‌ శర్మకు జోడీగా కోహ్లీ - ఆ ప్లేయర్​కు కూడా జట్టులో ఛాన్స్​! - T20 World Cup Teamindia Squad

ఓటమి బాధలో ఉన్న కోల్‌కత్తా కెప్టెన్‌ శ్రేయస్​కు మరో షాక్​ - IPL 2024

ABOUT THE AUTHOR

...view details