IPL 2024 Lucknow Super Giants Strengthness and Weakness : మరో తొమ్మిది రోజుల్లో ఐపీఎల్ 2024 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అయితే 2022లో గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన జట్టు లఖ్‌నవూ. మొదటి సీజన్లోఈ రెండు కొత్త జట్లపై పెద్దగా ఆశలు లేవు. కానీ గుజరాత్ ఏకంగా ట్రోఫీని ముద్దాడితే లఖ్‌నవూ మాత్రం చక్కటి ప్రదర్శనతో ప్లేఆఫ్స్ అర్హత సాధించింది. రెండో సీజన్లోనూ సూపర్‌జెయింట్స్ మంచి ప్రదర్శనే చేసింది. అయితే గత సీజన్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలో వైదొలిగినప్పటికీ ఆ టీమ్ నిలకడగా ప్రదర్శన చేసింది.
ఇక ఈసారి కూడా కెప్టెన్ రాహుల్ లీగ్ ముందు గాయపడినా ప్రస్తుతం సన్నద్ధతతోనే ఉన్నాడు. అతడి ఫామ్ కూడా బానే ఉంది. ఈ సీజన్ కోసం యంగ్ పేసర్ శివమ్ మావిని ఏకంగా రూ.6.4 కోట్లు పెట్టి కొనుకున్నారు. ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ డేవిడ్ విల్లీని రూ.2 కోట్లకు దక్కించుకున్నారు. దేవ్‌దత్ పడిక్కల్ కూడా రాజస్థాన్ నుంచి ఈ జట్టులోకి వచ్చాడు.
బలాల విషయానికొస్తే జట్టులో సమతూకం, సమష్టి ప్రదర్శన ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో అతి పెద్ద బలం. క్వింటన్ డికాక్, దేవ్‌దత్ పడిక్కల్, నికోలస్ పూరన్‌తో బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్‌గా ఉంది. కైల్ మేయర్స్, కృనాల్ పాండ్య, స్టాయినిస్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. డేవిడ్ విల్లీ, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, శివమ్ మావి, బిష్ణోయ్, మోసిన్‌లతో బౌలింగ్ కూడా బలంగానే ఉందనిపిస్తోంది. విండీస్ పేస్ సంచలనం షమర్ జోసెఫ్ మంచి ఆటగాడే.
బలహీనతల విషయానికొస్తే దేశీయ ప్లేయర్స్ బలం తక్కువగా అనిపిస్తోంది. రాహుల్ లాంటి మ్యాచ్ విన్నర్ లేడు. పడిక్కల్ ప్రస్తుతం అంతగా ఫామ్‌లో లేడు. కృణాల్ పాండ్య, దీపక్ హుడా, ఆయుష్ బదోని కూడా మోస్తరు ఆటగాళ్లే. పూరన్, డికాక్, స్టాయినిస్, మేయర్స్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ మీదే ఆధారపడాలి. వీరిలో డికాక్, స్టాయినిస్ కూడా అంత గొప్ప ఫామ్‌లో ఏమీ లేరు. వీరిని నమ్ముకుని లఖ్‌నవూ టైటిల్ అందుకుంటుందో లేదో.