ETV Bharat / state

అంతా రేపటి కోసమే - మరి మీరు రాబోయే కొత్త ఏడాదికి ప్లాన్స్​ చేసుకున్నారా? - PLANNED FOR THE NEW YEAR2025

మరో పది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి - సాధించాలనుకున్నదానికి వెంటనే పునాదులు వేయండి -ప్రతి క్షణం తృప్తితో జీవించేద్దాం

NEW YEAR MOTIVATION
2025 NEW YEAR PLANS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

2025 New Year Plannings : మరి కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం క్యాలెండర్‌ మారబోతోంది. ఒక ఏడాది అంటే 365 రోజులని కాదు 365 అవకాశాలు అర్థం. వాటిని అదును చూసి మంచి సందర్భంలో సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసి తీరుదాం. సాధించాలనుకున్నదానికి పనికి వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతి క్షణం జీవితంలో తృప్తితో గడిపేద్దాం. అలా చేయాలంటే మనకో ప్లానింగ్​ కావాలి మనల్ని ముందుకు నడిపే దిక్సూచి కావాలి.

ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు. మనం పెట్టుకునే లక్ష్యం దిశగా అడుగులు వేసే తపన నుంచి వస్తుంది. దాని కోసం మనం చేసే పోరాట కృషిలో నుంచి వస్తుంది. మనల్ని మనం విశ్లేషించుకొని చూసుకుంటే వస్తుంది. అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తిలో నుంచి వస్తుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న సమయాన మీ లక్ష్యాల సాధన దిశలో తోడుగా నిలుస్తుంది ‘ఈటీవీ భారత్’.

కారు ఎంత టాప్​ కంపెనీదైనా, ఇంజిన్‌ ఎంత శక్తిమంతమైనదైనా
రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నా, ముందు దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటే
తడబడుతూ, ఆగుతూ మెల్లగా సాగాల్సిందే స్పష్టమైన ప్రణాళికలు లేని జీవితాలు కూడా అంతే. ప్రతి దానికి ఓ లెక్కంటూ ఉంటే ప్రణాళికలతో జీవితం కొనసాగిస్తే జీవితం అందరికీ పూలపాన్పే.

NEW YEAR 2025
ప్రణాళిక బద్దంగా ముందుకు సాగడమే (ETV Bharat)

ఇంటికీ బడ్జెట్‌ : దేశానికే కాదు మన ఇంటికీ కూడా బడ్జెట్‌ కావాల్సిందే. ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్కరాసుకోండి. ఈ సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలు? వాటికి ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆదా చెయ్యాలి? ఇలా ఓ ప్రణాళికను రూపొందించుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చు అనే పదాన్ని దగ్గరకు రానివ్వద్దు.

అత్యవసర ఏటీఎంలా : ఎప్పుడు ఏ ఎమోర్జెన్సీ వస్తుందో, ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి అడిగితే డబ్బులు ఇచ్చేవారూ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆదుకోడానికి ఎమర్జెన్సీ ఫండ్‌ మీ వద్ద కొంత మొత్తంలో సిద్ధంగా ఉండాలి. దీనికోసం ప్రతినెలా ఎంతో కొంత సేవింగ్స్​ చేస్తూ పక్కనబెట్టాలి.

రిటైర్మెంట్‌ అండ్​ జాయినింగ్‌ : ఉద్యోగంలో రిటైర్మెంట్‌ ప్లాన్‌ 50 దాటాక ఆలోచించేది కాదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైర్మెంట్ గురించి ప్లాన్‌ చేసుకోవాలి. రిటైరయ్యేనాటికి ఎంత నగదు ఉండాలో ఆలోచించుకొని చిన్న వయసులోనే, సరైన పద్దతుల్లో మదుపు మొదలెడితే తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం జమవుతుంది.

బీమాలన్నీ ఉన్నాయా? : జీవితంలో ప్రతి ఒక్కరికీ బీమా ధీమానిస్తుంది. మోటార్, ఇల్లు, ఆరోగ్య, జీవిత బీమాలను తక్షణం సరిచూసుకోండి. వయసు మళ్లిన కొద్దీ బీమా షరతులు కాస్తా మారిపోతుంటాయి. కాబట్టి ఏ వయసులో ఏం చేయాలో ఇన్సురెన్స్​ ఏజెంట్‌ను సంప్రదించి, అవసరాలకు అనుగుణంగా పాలసీ తీసుకోండి.

PLANNED FOR THE NEW YEAR 2025
మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని సృష్టిస్తాయి (ETV Bharat)

మీ జీవితంలో అంతా ప్రణాళికాబద్దంగా ఉండాలి అని అంటారు ప్రఖ్యాత రచయిత కుష్వంత్‌ సింగ్‌. ఇదిగో ఈ ఎనిమిది సూత్రాలను అమలు చేస్తే జీవితంలో ఆనందమంతా మీదే అంటారాయన.

1.అసలైన సంపద అదే

ఆరోగ్యాన్ని నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే మాత్రం జీవితాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేరు.

2. బ్యాంక్‌ బ్యాలెన్స్‌

లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీ అవసరాలను తీర్చేంత కొంత ఉంటే చాలు. మనం అనుకున్న మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాన్ని ఆస్వాదించడం, నచ్చిన సినిమాను చూడడం. ఇలాంటి సాకారమయ్యే కోరికలను సాకారం చేసుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని ఒప్పుకోవడమే అవుతుంది.

3. ఆ కల కోసం

అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే ఫీలింగ్​ను కలిగించదు. మీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇష్టంగా కష్టపడండి. మీరే స్వయంగా మొక్కలను నాటండి. వాటి ఎదుగుదలను నిరంతరం చూడండి. వాటితో బంధుత్వ భావాన్ని మంచి మనసుతో పెంపొందించుకోండి.

4. అర్థం చేసుకునే భాగస్వామి

మీ జీవితంలో మరో మైలు రాయి మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి. మీ ప్రయాణంలో అపార్థాలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని అస్సలు తెచ్చుకోవద్దు.

5. పోలిక వద్దు

జీవితంలో మీకంటే ఉన్నతస్థాయిలో ఉన్నవారిని చూసి పోల్చి చూసుకోకండి. మీకన్నా చాలా బాగా ఎదిగారు బాగా సంపాదించారు. మంచి పేరు సంపాదించారంటూ ప్రతికూల ధోరణితో కూడిన ఆలోచనలు అస్సలు చేయకండి.

6. వారిని దగ్గరకు రానివ్వద్దు

గాలి కబుర్లు, చెప్పుడుమాటల కోసం వచ్చే వారిని మీ దగ్గరకు రాకుండా నిలుపుదల చేయండి. ఒకవేళ రానిస్తే వారిని మీరు వదిలించుకోవాలంటే చాలా అలసిపోతారు. మైండ్​ డిస్టర్బ్​ అవుతుంది.

7. సంతృప్తినిచ్చే అలవాట్లు

తోటపని, ఆడటం, చదవడం, రాయడం, పాటలు వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి. ఇవి మీలో క్రియేటివిటిని పెంచుతాయి.

8. రోజూ 15 నిమిషాలు

ప్రతి రోజ ఉదయం, సాయంత్రం 15 నిమిషాల చొప్పున సమయాన్ని మీ గురించి మీరు ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మరో 5 నిమిషాలు ఆరోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను తయారు చేసుకోవడానికి కేటాయించండి.

'న్యూ ఇయర్​ వేడుకలు 2025' పోలీసుల మార్గదర్శకాలు - వారికి మాత్రమే అనుమతి లేదు

మొన్న మహింద్రా, నిన్న టాటా.. న్యూ ఇయర్ సమీపిస్తున్న కొద్దీ కార్ల ధరలకు రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.