ETV Bharat / bharat

'మా మనవడు ఎక్కడున్నాడు'- సుప్రీంకోర్టులో బెంగళూరు టెకీ తల్లి రిట్‌ పిటిషన్‌ - BENGALURU TECHIE SUICIDE CASE

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్‌ తల్లి - మనవడిని అప్పగించాలంటూ పిటిషన్

Bengaluru Techie Atul Subhash
Supreme Court, Bengaluru Techie Atul Subhash (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Bengaluru Techie Suicide Case : భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారి జాడను గుర్తించి, తమకు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ మనవడి గురించి నిఖితా సింఘానియా లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదని తెలిపారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఫరిదాబాద్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో తన కుమారుడు చదువుతున్నాడని, తన సమీప బంధువు సుశీల్‌ సింఘానియా కస్టడీలో ఉన్నాడని అతుల్ భార్య పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే పిల్లాడి జాడ గురించి తనకు తెలియదని సుశీల్ చెప్పడం గమనార్హం.

గతంలో అతుల్ తండ్రి కూడా తన మనవడి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అతుల్‌కు కుమారుడు జన్మించినట్లు చెప్పారు. ఆ తర్వాత నిఖితా, తన కుమారుడు విడిపోయారని అప్పటి నుంచి తన మనవడిని చూడలేదని వెల్లడించారు. కేవలం వీడియో కాల్స్‌లో మాత్రమే చూశామని చెప్పారు. తమ మనవడి బాగోగులపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

ఈనెల మెుదట్లో బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు భార్య నిఖితా సింఘానియాతో తాను అనుభవించిన మానసిక క్షోభను ఏకంగా 40 పేజీల లేఖను రాశారు. భార్య వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో చెప్పాడు. ఆ లేఖను ఇ-మెయిల్‌ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతుల్‌ సుభాష్‌ వీడియో వైరల్ కావడం వల్ల ఆయన భార్య, కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.