తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ కూడా కష్టపడాల్సి వచ్చింది - అందుకే ఓడిపోయాం' - IPL 2024 KKR VS RCB - IPL 2024 KKR VS RCB

IPL 2024 KKR VS RCB : కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో సొంత మైదానంలోనే ఓడిపోవడంపై స్పందించాడు ఆర్సీబీ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్​. ఏం అన్నాడంటే?

'కోహ్లీ కూడా కష్టపడాల్సి వచ్చింది - అందుకే ఓడిపోయాం'
'కోహ్లీ కూడా కష్టపడాల్సి వచ్చింది - అందుకే ఓడిపోయాం'

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 10:24 AM IST

Updated : Mar 30, 2024, 11:10 AM IST

IPL 2024 KKR VS RCB :సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ ఎడిషన్‌లో సొంతగడ్డపై కాకుండా ఇతర మైదానంలో గెలిచిన తొలి జట్టు కోల్‌కతానే కావడం విశేషం. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా చేధించి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్​ను ముగించింది. ఈ మ్యాచ్ రిజల్ట్​పై ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడారు.

సొంత మైదానంలోనే ఓడిపోవడంపై ఆర్సీబీ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్ మాట్లాడుతూ పిచ్ కండిషన్స్ తమకు ప్రతికూలంగా మారాయని పేర్కొన్నాడు. "ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మైదానం డబుల్ ఫేస్‌డ్‌గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి వాతావరణం మారి పిచ్ కాస్త మెరుగైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. క్రీజులో నిలదొక్కుకున్న విరాట్ కోహ్లీ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. కొన్ని విషయాలను విభిన్నంగా ప్రయత్నించి ఉండాల్సింది. తొలి ఆరు ఓవర్లలోనే సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ బాగా ఆడి బ్యాటింగ్​తో మా నుంచి మ్యాచ్​ను లాగేశారు. మా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. సెకండ్ ఇన్నింగ్స్​లో స్పిన్ వేద్దామనుకుంటే రైట్ హ్యాండ్ కాంబినేషన్​తో దిగిన కోల్​కతా బ్యాటర్లకు కరెక్ట్ కాదనిపించింది. మ్యాక్స్ వెల్​తో పాటు ఫింగర్ స్పిన్నర్లను ప్రయత్నించాలనుకున్నాం. కానీ, ఈ వికెట్ పై అంతగా టర్న్ లభించలేదు. వైశాక్ బౌలింగ్ బాగుంది. ముందుగా కర్న్ శర్మతో బౌలింగ్ వేయించాలనుకున్నాం. కానీ, ఈ పిచ్ మీద స్లో బౌలింగ్ వేయగలవారైతేనే కరెక్ట్ అనిపించింది." అని డుప్లెసిస్ స్పందించాడు.

కోల్​కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ రస్సెల్ బౌలింగ్ వేసేటప్పుడే ఈ పిచ్​ ఫాస్ట్​కు సహకరిస్తుందని అర్థమైంది. అందుకే అతడు స్లో బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. బెంగళూరుతో మ్యాచ్​కు ముందు ఈ మైదానంలో రెండు సెషన్లు ప్రాక్టీస్ చేయడం ఉపయోగపడింది. ఓపెనర్​గా సునీల్ నరైన్ ఊహించినట్లుగానే ఆడి అద్భుతమైన ఆట కనబరిచాడు." అని వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అతడు మాట్లాడుతూ "బెంగళూరు బౌలర్ వైశాక్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. అతను సంధిస్తున్న స్లో బౌలింగ్ తీరు మమ్మల్ని బాగా ఇబ్బందిపెట్టింది. మా బౌలర్లు ఇలానే బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు. ఇకపోతే సునీల్ నరైన్ మంచి ఆరంభం ఇచ్చాడు. కీలకమైన మ్యాచ్​లో ఫామ్ అందుకోగలిగాను. ఏ ప్లాట్ ఫాం అయినా 100 శాతం ఆడేందుకు ప్రయత్నిస్తా" అని వెంకటేశ్ అయ్యర్ వివరించాడు.

ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు - ఈ ఫన్నీ మీమ్స్​ చూశారా? - IPL 2024 KKR VS RCB

కోల్​కతాతో మ్యాచ్​ - క్రిస్​ గేల్​ రికార్డ్​ను బ్రేక్​ చేసిన కోహ్లీ - IPL 2024 Kohli Most sixes

Last Updated : Mar 30, 2024, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details