IPL 2024 Kolkata Knight Riders : ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 8 విజయాలను అందుకుంది. ఫలితంగా పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో నిలిచింది. అలానే దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది! అయితే తాజాగా ఆ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్‌ను రెండుసార్లు దారి మళ్లించడమే ఇందుకు కారణం. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని దారి మళ్లీంచాల్సి వచ్చింది. అందుకే కేకేఆర్ ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని కోల్‌కతా యాజమాన్యం తమ ఎక్స్ (X)ఖాతాలో అఫీషియల్‌గా షేర్ చేసుకుంది.
Kolkata Knight Riders Matches Schedule : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఆదివారం మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ మ్యాచ్‌ను మే 11న ముంబయి ఇండియన్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ సోమవారం సాయంత్రం లఖ్‌నవూ నుంచి బయలు దేరింది. 5.45 గంటల సమయంలో ఛార్టర్డ్ విమానంలో కోల్‌కతాకు వెళ్లింది. అయితే విమానం 7,25 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ కోల్‌కతాలో కుండపోత వర్షం పడటంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఫ్లైట్‌ను గువాహటికి దారి మళ్లించాల్సి వచ్చింది.
ఇక గువాహటికి చేరుకున్న కేకేఆర్(కోల్‌కతా నైట్ రైడర్స్) జట్టుకు ఆ తర్వాత క్లియరెన్స్ వచ్చింది. దీంతో విమానం కోల్‌కతాకు బయలు దేరింది. కానీ, మళ్లీ ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఫ్లైట్‌ను వారణాసికి దారి మళ్లించారు. అలా సోమవారం రాత్రి కేకేఆర్ ప్లేయర్స్ ఓ హోటల్‌లో బస చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ ఛార్టర్డ్ విమానం వారణాసి నుంచి కోల్‌కతాకు బయలు దేరనుంది.