ETV Bharat / health

ఇవి తింటే గుండె సమస్యలు రావట! - పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి! - HEART HEALTHY FOODS

గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలా? - డైట్​లో ఇవి ఉండాల్సిందే అంటున్న నిపుణులు!

HEART HEALTHY FOODS
These Foods Good for Heart Health (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

These Foods Good for Heart Health : మన శరీరంలో ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, మారుతున్న జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన వ్యాయామం, విశ్రాంతితో పాటు, గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉంటే, ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో మెడిటరేనియన్ డైట్​లోని కొన్ని మొక్కల ఆధారిత ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, సమస్యల ముప్పును తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు. స్పెయిన్ పరిశోధకులు జరిపిన ఈ రీసెర్చ్ ఇటీవల "ఫుడ్ బయోసైన్స్" అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనకు "యూనివర్సిటీ ఆఫ్ బార్నిలోనా"లో పోస్ట్‌ డాక్టోరల్ పరిశోధకుడైన రెనే డెల్గాడో మార్గదర్శకత్వంలో పనిచేసిన జీవశాస్త్రవేత్త మాటేయూ అంగురా తేజెడోర్ నాయకత్వం వహించారు. ఇంతకీ, ఆ ఫుడ్స్ ఏంటి? పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెడిటరేనియన్ డైట్​లోని కొన్ని మొక్కల సంబంధిత ఆహారాలపై ఈ పరిశోధనను జరిపారు. ముఖ్యంగా వెల్లుల్లి, కుంకుమపువ్వు, ఆలివ్, రోజ్మేరీ, గ్రేప్‌వైన్(ద్రాక్ష) వంటివి అందులో ఉన్నాయి. ఈ మొక్కలలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాసోడైలేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఇవి హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని గుర్తించారు.

ప్రధానంగా వెల్లుల్లి, కుంకుమపువ్వు, ఆలివ్, రోజ్మేరీ, గ్రేప్‌వైన్(ద్రాక్ష) మొక్కల నుంచి వచ్చే బయోయాక్టివ్ సమ్మేళనాలు అథెరోస్క్లెరోసిస్ చికిత్సలో, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, మానవులలో ఈ సమ్మేళనాల ప్రభావాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మీ డైట్​లో వెల్లుల్లి, ఆలివ్, రోజ్మేరీ, కుంకుమపువ్వు, ద్రాక్ష సంబంధిత ఆహారాలను చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా కీలకమే అంటున్నారు. ఇందుకోసం చిరుతిండ్లు, నూనె సంబంధిత పదార్థాలను వీలైనంత వరకు తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా రోజూ శరీరానికి తగినంత వ్యాయామం అందేలా జాగ్రత్తపడాలంటున్నారు. అలాగే, మానసిక సమస్యలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్‌ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!

హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.