IPL 2024 Gujarat Titans vs Delhi Capitals :అహ్మదాబాద్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
జేక్ ఫ్రేజర్(10 బంతుల్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్ల సాయంతో 20 పరుగులు), అభిషేక్ పోరల్(7 బంతుల్లో ఓ సిక్స్, రెండు ఫోర్ల సాయంతో 15 పరుగులు), షాయ్ హోప్(10 బంతుల్లో 2 సిక్స్‌లు ఓ ఫోర్ సాయంతో 19 పరుగులు), రిషభ్ పంత్(11 బంతుల్లో ఓ సిక్స్, ఓ ఫోర్ సాయంతో 16 నాటౌట్), సుమిత్ కుమార్(9 నాటౌట్ ) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెంసర్ జాన్సన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అంతకుమందు బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి మట్టికరిపించారు. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) విజృంభించడం వల్ల గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలిపోయింది. వికెట్‌కీపర్, బ్యాటర్, దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలకంగా వ్యవహరించాడు. గుజరాత్ బ్యాటర్లలో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారు విఫలమయ్యారు.