తెలంగాణ

telangana

ETV Bharat / sports

కింగ్​ కోహ్లీ ఖాతాలోకి మరో సూపర్ రికార్డ్​ - IPL 2024 CSK VS RCB - IPL 2024 CSK VS RCB

IPL 2024 CSK VS RCB Kohli : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్​లో కోహ్లీ మరో సూపర్ రికార్డ్​ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలు.

కింగ్​ కోహ్లీ ఖాతాలోకి మరో కొత్త రికార్డ్​
కింగ్​ కోహ్లీ ఖాతాలోకి మరో కొత్త రికార్డ్​

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 7:09 AM IST

IPL 2024 CSK VS RCB Kohli :రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ టీ20 కెరీర్​లో మరో ఘనత సాధించాడు. కెరీర్​లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 360 ఇన్నింగ్స్​లో 41.21 యావరేజ్​, 133.42 స్ట్రైక్​రేట్‌తో ఈ మార్క్​ను అందుకున్నాడు. వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు క్రిస్‌ గేల్‌ 343 ఇన్నింగ్స్​లో ఈ ఫీట్​ను అందుకుని ఈ జాబితాలో ముందు నిలిచాడు.ఆ తర్వాతి స్థానాల్లో పాక్‌ షోయబ్‌ మాలిక్‌ (13360), విండీస్‌ పోలార్డ్‌ (12900), ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్‌ హేల్స్‌ (12319), ఆసీస్ స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (12065) ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కోహ్లీ చేరాడు.

కోహ్లీ చేసిన మొత్తం 12 వేల పరుగుల్లో 4037 టీమ్​ ఇండియా తరఫునవి. ఆర్సీబీ తరపున 7693, ఇతర టోర్నీల్లో 270 ఇతర సాధించాడు. ఇక టీమ్‌ఇండియా ప్లేయర్స్​లో రోహిత్‌ శర్మ (11,156) కోహ్లీకి దగ్గరగా ఉన్నాడు. విరాట్ టీ20​ కెరీర్​లో 8 టీ20 సెంచరీలు ఉన్నాయి. అందులో ఏడు ఐపీఎల్‌లోనే సాధించాడు. మొత్తంగా టీ20ల్లో అత్యధిక రన్స్ సాధించిన జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. క్రిస్​ గేల్‌ 14562 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీ 3 - డుప్లెసిస్‌ 35 :గత కొద్ది రోజులుగా కోహ్లీ ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు పుట్టడంతో రెండు నెలలు ఆటకు అందుబాటులో లేడు. ఈ శుక్రవారమే ఐపీఎల్ మ్యాచ్​లో మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ తన తొలి మ్యాచ్‌లో అంత మంచి ప్రదర్శన చేయలేదు. సాధారణంగా ఫస్ట్ బాల్​ నుంచే దూకుడు ప్రదర్శన చేసి పరుగులు చేసే విరాట్‌ చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్​ మొదటి బంతికి సింగిల్‌ తీసిన అతడు నాలుగో ఓవర్‌ ఫస్ట్ బాల్​కు కానీ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. ఈలోగా డుప్లెసిస్‌ 30 పరుగులు సాధించాడు. ఐయిదో ఓవర్లో డుప్లెసిస్‌ 35 పరుగుల వద్ద ఔట్‌ అవ్వగా అప్పటికీ కోహ్లీ 3 పరుగులే సాధించాడు. ఆ తర్వాత కూడా నెమ్మదిగానే ఆడాడు. బంతిని మిడిల్‌ చేయడంలోనూ కాస్త ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఇక ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రచిన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు.

ఆర్సీబీకి షాక్​ - బోణీ కొట్టిన చెన్నై - CSK vs RCB IPL 2024

వాళ్ల బ్యాగ్ మోసిన ధోనీ- ఫ్యాన్స్ ఫిదా!- వీడియో వైరల్ - MS Dhoni IPL 2024

ABOUT THE AUTHOR

...view details