India WTC Final Scenario 2025 :2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌పై కన్నేసిన భారత్‌కు బ్యాక్ టు బ్యాక్ ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి, పరాజయం మూటగట్టుకుంది. దీంతో 2025 డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియాపై కాస్త ప్రభావం పడింది. పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ, పాయింట్ల పర్సెంటేజీలో తగ్గుదల వచ్చింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియానే టాప్‌లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఒకటి డ్రాగా ముగించింది. దీంతో టీమ్‌ఇండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. అయితే పాయింట్ల పర్సెంటేజీ మాత్రం 68.06 నుంచి 62.82 శాతానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50)కు భారత్‌కు, 0.32 శాతం మాత్రమే తేడా ఉండడం గమనార్హం.
ఫైనల్ చేరాలంటే?
తాజా ఓటమితో టీమ్ఇండియా ఫైనల్ ఛాన్స్‌లు మరింత సంక్లిష్టంగా మారాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 1 మ్యాచ్ ఉండగా, ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్ ఇతరుల ఫలితాలపై ఆధారపడకుండా వరుసగా ముూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 70శాతం పాయింట్ పర్సెంటేజీ ఉండాల్సిందే.