IND W VS IRE W : ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ వికెట్ల తేడాతో నెగ్గింది. 239 పరుగుల ఛేదనలో టీమ్ఇండియా నిలకడగా రాణించింది. ఓపెనర్ రాధికా రావల్ (89 పరుగులు), తేజల్ హసబ్నిస్ (53* పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎమీ మాగ్యురె 2, ఫ్రెయా సార్జెంట్ 1 వికెట్ పడగొట్టారు.
ఐర్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం- లీడ్‌లోకి భారత్ - IND W VS IRE W ODI
ఐర్లాండ్‌తో సిరీస్‌లో భారత్ శుభారంభం- 1-0తో లీడ్‌లోకి టీమ్ఇండియా
Published : Jan 10, 2025, 5:25 PM IST
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ (92), లేహ్ పాల్ (59) అర్థ శతకాలు బాదారు. మిగతా బ్యాటర్లలో సారా 9, ఉనా 5, ఓర్లా 9, లారా డెలానీ డకౌట్, కౌల్టర్ 15, డెంప్సీ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 12న జరగనుంది.