India Women vs West Indies Women :మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేసింది. 211 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. 315 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన ప్రత్యర్థి జట్టు కేవలం 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. ఫ్లెచర్ (24*) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్లు మాథ్యూస్ (0), జోసెఫ్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. భారత్ బౌలర్లలో రేణుక ఠాకూర్ సింగ్ 5 వికెట్లు పడగొట్టి విండీస్ జట్టును దెబ్బతీసింది. ప్రియా మిశ్రా 2, సాధు ఒక వికెట్ తీశారు.
మ్యాచ్ సాగిందిలా :
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (90), ప్రతీకా రావెల్ (40) తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుస బౌండరీలతో విండీస్ జట్టును బెంబేలెత్తించారు. అయితే భీకరంగా మారిన ఈ జోడీని మాథ్యూస్ విడగొట్టింది. ఆమె బౌలింగ్‌లో ప్రతీకా కాట్ అండ్ బౌల్డ్‌గానే పెవిలియన్ బాట పట్టింది.
తొలి డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్ (44)తో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. అయితే, జట్టు స్కోరు 160 పరుగుల వద్ద జేమ్స్ బౌలింగ్ స్మృతి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), రోడ్రిగ్స్ (31), దీప్తి శర్మ (14*) దూకుడుగా ఆడటం వల్ల టీమ్ఇండియా మహిళల జట్టు భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5 వికెట్లు పడగొట్టగా కెప్టెన్ మాథ్యూస్ 2, డాటిన్ ఒక వికెట్ తీశారు.