India Women Vs Australia Women 1st ODI : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు పరాజయం చూసింది. ఈ పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత మహిళా జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది
మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబాటకు గురైంది. లక్ష్యం 101 పరుగులే కావడం వల్ల వికెట్లు పడినా కూడా ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జార్జియా వోల్ (46; 42 బంతులు 6 ఫోర్లు, 1 సిక్స్), ఫోబ్ లిట్చ్ ఫీల్డ్ (35; 29 బంతులు 8 ఫోర్లు) మంచిగానే రాణించారు. ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్, అష్లెగ్ గార్డ్నర్, తాహ్లియా మెక్గ్ర్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.
భారత్ డౌన్ -కెరీర్‌లో మొదటి వన్డే ఆడుతోన్న ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ స్కట్ (5/19) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్ బ్యాటర్లను బెంబేలెత్తించింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచింది.