తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్, పాక్ మ్యాచ్​కు అంతా రెడీ - హెడ్ టు హెడ్ రికార్డ్స్​ ఇవే - మ్యాచ్​​ ఎందులో చూడాలంటే?

ఎమ‌ర్జింగ్ టీమ్స్​ ఆసియాక‌ప్‌ - 2024లో భాగంగా పాక్​తో తలపడనున్న భారత్​

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

IND VS PAK Emerging Asia cup 2024 :
IND VS PAK Emerging Asia cup 2024 : (source ETV Bharat)

IND VS PAK Emerging Asia cup 2024 : ఎమ‌ర్జింగ్ టీమ్స్​ ఆసియాక‌ప్‌ - 2024లో భాగంగా భార‌త జట్టు త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్థాన్​తో ఇండియా - ఎ జ‌ట్టు పోటి పడనుంది. ఇరు జ‌ట్ల‌కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీని శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆక్టోబ‌ర్ 19న మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్ర‌త్య‌ర్ధిలు మ‌ధ్య పోరు జ‌ర‌గ‌నుంది.

భార‌త జ‌ట్టుకు యంగ్ ప్లేయర్​, హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఇండియా జ‌ట్టులో తిల‌క్‌తో పాటు యువ సంచ‌ల‌నం అభిషేక్ శర్మ కూడా చోటు ద‌క్కించుకున్నాడు. ఇంకా ఐపీఎల్‌లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్స్​ రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ఆయుష్ బదోని (లఖ్​నవూ సూపర్ జెయింట్స్), నేహాల్ వదేరా (ముంబయి ఇండియన్స్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) కూడా ఈ టోర్నీకి ఎంపికయ్యారు.

మరోవైపు పాకిస్థాన్​ జ‌ట్టుకు యంగ్​ ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ హ్యారీస్ సారథ్యం వహించనున్నాడు. గ‌తేడాది అత‌డి నేతృత్వంలోనే పాక్ టీమ్​ ఎమ‌ర్జింగ్ ఆసియా క‌ప్ ఛాంపియన్స్‌గా అవతరించింది. దీంతో ఇప్పుడు మరోసారి విజయం సాధించేందుకు హ్యారీస్ పట్టుదలతో ఉన్నాడు.

ఫైనల్ జరిగేది అప్పుడే - మొత్తం ఈ టోర్నీలో 8 జట్లు తలపడతాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్​ ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ నిర్వహించనున్నారు.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? - ఈ టోర్నీ మ్యాచ్​లను భార‌త్‌లో ఫ్యాన్‌కోడ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్ - లిస్ట్​ ఏ మ్యాచుల్లో ఇరు జట్లు 14 సార్లు తలపడ్డాయి. అందులో భారత జట్టు 9 సార్లు గెలవగా, పాకిస్థాన్ ఐదు సార్లు విజయాలను నమోదు చేసింది. అయితే ఫైనల్​ మ్యాచ్​లలో పాక్ జట్టు బలంగా ఆడుతోంది. గతేడాది జరిగిన ఎమర్జింగ్​ టీమ్స్​ ఆసియా కప్​​లో గ్రూప్ స్టేజ్​లోని మ్యాచ్​లో 8 వికెట్లతో పాక్​పై భారత్ గెలవగా, ఫైనల్​లో 128 పరుగుల తేడాతో భారత్​ను ఓడించింది పాక్​. ఈ ఫైనల్ పోరులో తయ్యబ్​​ తాహిర్​ సెంచరీ బాదాడు.

భారత్ ఎ జట్టు - తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నిశాంత్ సింధు, ఆయుష్ బదోని, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్ (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నెహాల్ వధేరా, ఆకిబ్ ఖాన్, హృతిక్ షోకీన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా సలాం.

పాకిస్థాన్ ఎ జట్టు :మహ్మద్ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఖాసిమ్ అక్రమ్, అబ్బాస్ అఫ్రిది, షానవాజ్ దహానీ, అహ్మద్ డానియాల్, హసీబుల్లా ఖాన్ (వికెట్-కీపర్), మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, యాసిర్ ఖాన్, సుఫియాన్ ముఖిమ్, అరాఫత్ మిన్హాస్, అబ్దుల్ సమద్, ఒమైర్ యూసుఫ్, మెహ్రాన్ ముఖిమ్.

టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా సంచలన రికార్డ్​ - 147 ఏళ్లలో తొలిసారి ఇలా

పాకిస్థాన్ సంచలనం - సొంత గడ్డపై 1348 రోజుల తర్వాత భారీ విజయం!

ABOUT THE AUTHOR

...view details