తెలంగాణ

telangana

ETV Bharat / sports

షమీ ఔట్, దూబె ఇన్​! ఆ స్టార్ కోసం సంజు 'స్పెషల్' ట్రైనింగ్‌! - మూడో టీ20లో కీలక మార్పులు ఇవే! - SANJU SAMSON IND VS ENG 3RD T20

షమీ ఔట్, దూబె ఇన్​! - జోఫ్రా ఆర్చర్‌ కోసం సంజు 'స్పెషల్' ట్రైనింగ్‌! - మూడో టీ20లో కీలక మార్పులు ఇవే!

Sanju Samson IND VS ENG 3rd T20
IND VS ENG 3rd T20 (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 28, 2025, 1:22 PM IST

Sanju Samson IND VS ENG 3rd T20 : ఇంగ్లాండ్​తో తొలి రెండు టీ20ల్లో టీమ్​ఇండియా ఓపెనర్ సంజు శాంసన్​ పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసినప్పటికీ, భారీ స్కోరు దిశగా సాగలేకపోయాడు. ఇక రెండో టీ20లోనూ ఐదు పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే రెండుసార్లు కూడా అతడు ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ చేతికే చిక్కాడు. షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో అతడు ఇబ్బందిపడ్డాడు.

ఈ క్రమంలో రాజ్‌కోట్‌ వేదికగా మంగళవారం జరగనున్న మూడో టీ20లో ఆర్చర్​కు అటువంటి ఛాన్స్​ ఇవ్వకూడదనే ఉద్దేశంతో సంజు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అతడు తీవ్రంగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. సిమెంట్ పిచ్‌పై కొత్త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో కలిసి అతడు బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేయగా, త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా తనకు ఈ విషయంలో సాయం చేశారట. దాదాపు 45 నిమిషాల పాటు కేవలం ప్లాస్టిక్‌ బాల్​తోనే పుల్, హుక్ షాట్లను ఆడాడట. దీంతో పాటు ర్యాంప్, కట్ షాట్లను కొట్టాడు. ఇవే కాకుండా ఓ అర్ధ గంటపాటు క్లైంబింగ్‌ బాల్‌ (వేలాడదీసిన బంతులు)తోనూ సంజూ ప్రాక్టీస్ చేశాడట.

షమీ ఔట్​, దూబె ఇన్​!
ఇదిలా ఉండగా, మూడో టీ20లో భారత ప్లేయింగ్ 11పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ సారి మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో యంగ్​ ప్లేయర్​ ధ్రువ్‌ జురెల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో శివమ్‌ దూబెకు మేనేజ్​మెంట్​ ఛాన్స్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు ఉండటం వల్ల మీడియం పేసర్‌ అందుబాటులో ఉన్నట్లు అవుతుందని క్రికెట్ వర్గాల మాట.

మరోవైపు షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ, రానున్న మ్యాచ్‌లో అతడు ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇక గాయం కారణంగా నితీశ్ కుమార్‌ రెడ్డి సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇవి తప్ప మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చుని క్రిిటిక్స్ అ. ఇప్పటికే ఇంగ్లండ్‌ తమ ఫైనల్ XIను ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారత్ తుది జట్టు (అంచనా) : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్.

ఇంగ్లాండ్ తుది జట్టు (అంచనా) : జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్‌ లివింగ్‌ స్టోన్, బెన్ డకెట్, ఫిల్‌ సాల్ట్ (వికెట్ కీపర్), జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్‌, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్‌ వుడ్

భారత్ x ఇంగ్లాండ్ సిరీస్- ఆ ఇద్దరు మళ్లీ ఫెయిల్- టెన్షన్​లో RCB ఫ్యాన్స్!

కింగ్​ కోహ్లీని దాటేసిన తిలక్ వర్మ- తెలుగోడి దెబ్బకు ప్రపంచ రికార్డ్​ బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details