India Vs Bangladesh T20 World Cup 2024:India vs Bangladesh T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ సూపర్- 8లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 50 పరుగుల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తేలిపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. నజ్ముల్ హసన్ శాంటో (40 పరుగులు) టాప్ స్కోరర్. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెలో 2, హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్కు చేరినట్లే!
భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడింది. ఇక 5వ ఓవర్లో హార్దిక్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ లిటన్ దాస్ (13) క్యాచౌట్గా పెలివియన్ చేరాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగినా వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక 9.4 వద్ద బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. తన్జీద్ హసన్ (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంగ్లా వరుసగా కోల్పోయింది. తౌహిద్ హ్రిదయ్ (4), షకీబ్ అల్ హసన్ (11), నజ్ముల్ హసన్ శాంటో, జాకీర్ అలీ (1), రిషద్ హసెన్ (24) ఔటయ్యారు.