తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెల్​బోర్న్​లో హైయ్యెస్ట్ ఛేజింగ్స్- 96ఏళ్ల రికార్డ్​ను టీమ్​ఇండియా బ్రేక్ చేయనుందా? - HIGHEST RUN CHASE AT MCG IN TEST

మెల్​బోర్న్​లో హైయ్యెస్ట్ ఛేజింగ్స్- భారత్​ కూడా ఒకసారి ఛేదించిందిగా!

Highest Run Chase At MCG In Test
Highest Run Chase At MCG In Test (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 29, 2024, 2:39 PM IST

Highest Run Chase At MCG In Test :భాఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా భారత్ నాలుగో టెస్టు ఆడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 228/9 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేయగా భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. దీంతో బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియాకు భారీ లక్ష్యమే ఎదురైంది. సోమవారం ఆటకు చివరి రోజు. ఆట కూడా షెడ్యూల్ కంటే అర్ధ గంట ముందే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు మొదలవుతుంది. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు 96 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఈ క్రమంలో మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లో టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంత? భారత్ మెల్​బోర్న్​లో ఎన్ని సార్లు సక్సెస్​ఫుల్​గా రన్ ఛేజ్ చేసింది? అవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హైయ్యెస్ ఛేజింగ్ రికార్డు
మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లో ఇంగ్లాండ్ 1928లో 332 పరుగులను లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే మెల్​బోర్న్​లో అత్యధిక పరుగుల ఛేజింగ్. ఇప్పటివరకు మెల్​బోర్న్​లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్ (8), ఆసీస్ (21) సార్లు విజయంతంగా ఛేజింగ్ చేశాయి. 1953లో దక్షిణాఫ్రికా ఒకసారి 297 పరుగుల లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్​గా ఛేదించింది.

రెండు జట్లే
ఉపఖండంలోని జట్ల విషయానికొస్తే, 2020 డిసెంబర్​లో ఆసీస్​పై భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 70 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2008లో దక్షిణాఫ్రికా183 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మినహా ఉపఖండంలోని ఇంకే జట్లు ఛేజింగ్​లో మెల్​బోర్న్ క్రికెట్ స్టేడియంలో గెలవలేదు.

రెండు సార్లు మాత్రమే
కాగా, ఇప్పటివరకు ఆసీస్ పిచ్​లపై రెండు మాత్రమే టీమ్ఇండియా 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2021 జనవరిలో జరిగిన చారిత్రక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్​లో జరిగిన టెస్టులో 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఆలాగే 2003లో జరిగిన ఆడిలైడ్ టెస్టులో టీమ్ఇండియా 230 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

బోర్డర్- గావస్కర్​లో
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చరిత్రలో 19 విజయవంతమైన రన్ ఛేజ్​లు జరిగాయి. అందులో భారత్ 12 సార్లు భారత్, 7 సార్లు ఆసీస్ ఛేజింగ్​​ చేశాయి. టాప్- 11 రన్ ఛేజింగ్​లలో తొమ్మిది భారత్​వే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో భారత్ 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఒకసారి, 300 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఒకసారి ఛేదించింది.

'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్​స్టాస్​ను క్లీన్​ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు

బుమ్రా@ 200- తొలి భారత బౌలర్​గా రికార్డ్- కెరీర్​లో మరో ఘనత

ABOUT THE AUTHOR

...view details