India Vs Australia Border Gavaskar Trophy :టీమ్ఇండియా మేనేజ్మెంట్ తాజాగా కీలక డెసిషన్ తీసుకుంది. ఇకపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ప్రాక్టీస్ సెషన్లను అభిమానులు లేకుండానే నిర్వహించనున్నారు. అడిలైడ్ టెస్టు కోసం టీమ్‌ఇండియా సాధన చేస్తున్న సమయంలో కొందరు ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మంగళవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారీగా అభిమానులు అడిలైడ్ స్టేడియానికి వచ్చారు. అయితే అందులో కొందరు భారత ప్లేయర్లను ఉద్దేశించి దురుసు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీంతో పాటు ప్లేయర్లను వారు ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.
"టీమ్ఇండియా ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లో స్టేడియం అంతా గోల గోలగా ఉంది. సుమారు 3 వేల మందికిపైగా ఈ ప్రాక్టీస్ చూసేందుకు వచ్చారు. అదే ఆస్ట్రేలియా టీమ్ ప్రాక్టీస్ సెషన్ మాత్రం ప్రశాంతంగా సాగింది. అక్కడ మాత్రం వందలోపు అభిమానులు మాత్రమే ఈ సెషన్‌ను వీక్షించారు. విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ ఆడుతున్న సమయంలో కొందరు అభిమానుల్లో ఆ సెషన్‌ను ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. మరికొందరైతే వీడియో కాల్‌లో వారిని చూపిస్తూ గట్టిగా మాట్లాడటం మొదలెట్టారు. అంతేకాకుండా ఒకతను అయితే 'హాయ్' అని చెప్పమంటూ ఓ భారత బ్యాటర్‌ను గుజరాతి భాషలో పదే పదే అడిగినట్టు తెలుస్తోంది. ఇంకోకరేమో క్రికెటర్ శరీరం గురించి ఒకతను అవహేళనగా మాట్లాడాడట. అందుకే ఈ సిరీస్‌లో భారత్ ప్రాక్టీస్‌కు అభిమానులను అనుమతించట్లేదు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.