Ind vs Aus 2nd Test :అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ ఓడింది. టీమ్ఇండియా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడం వల్ల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. పింక్ బాల్ మ్యాచ్‌లో తేలిపోయిన టీమ్ఇండియా ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అతి స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ కోల్పోకుండా 20 బంతుల్లోనే మ్యాచ్ పూర్తి చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1- 1తో సమం అయ్యింది.
భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని కొనసాగిస్తూ, రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయారు. ఓవర్‌నైట్ స్కోర్ 128-5తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా మరో 47 పరుగులు మాత్రమే జోడించింది. 175 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్‌కు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (42 పరుగులు) టాప్ స్కోరర్. జైస్వాల్ (24 పరుగులు), గిల్ (28 పరుగులు), పంత్ (28 పరుగులు) మరోసారి తక్కువ స్కోర్లకే పరిమితం అయ్యారు.