IND VS SA T20 Series : సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాలో, తిలక్ వర్మ (120*: 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు శాంసన్ (109*: 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతకాలతో చేలరేగడంతో వికెట్ కోల్పోయి 283 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
భారత బ్యాటర్ల తుపాను ఇన్నింగ్స్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా, నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మొదటి ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. అయితే రెండో ఓవర్ నుంచి సంజూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు.
అతడికి తోడుగా అభిషేక్ శర్మ (36: 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదో ఓవర్‌లో చెలరేగి ఆడాడు. వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్, చివరి బంతికి మళ్లీ సిక్స్ బాది ఊపులోకి వచ్చాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే సిపమ్లాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక మొదట నుంచి జాగ్రత్తగా ఆడిన తిలక్, తొమ్మిదో ఓవర్‌లో గేర్ మార్చి దూసుకెళ్లాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. 10వ ఓవర్లో శాంసన్ వరుసగా రెండు సిక్స్‌లు బాదగా, తిలక్ రెండు ఫోర్లు కొట్టాడు.
అలా ఓ వైపు సంజు శాంసన్, మరో ఎండ్‌లో తిలక్ వర్మ ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. అలా వీరి దూకుడు ప్రదర్శనకు 10 ఓవర్లకు 129/1తో ఉన్న టీమ్ ఇండియా స్కోర్, 15 ఓవర్లకు 219/1గా మారిపోయింది. కేవలం 5 ఓవర్లలోనే 90 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో వీరిద్దరూ సెంచరీలు బాదేశారు. సంజూ 51 బంతుల్లో, తిలక్ వర్మ 41 బంతుల్లోనే శతకాలు బాదారు.
4వ టీ20లో శతకొట్టిన సంజూ శాంసన్, తిలక్ వర్మ - పగిలిన లేడీ ఫ్యాన్ దవడ!
IPL 2025 మెగా వేలం ప్లేయర్ల ఫైనల్ లిస్ట్ ఇదే - మొత్తం ఎంత మంది అంటే?