Ind vs Pak T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్ పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. కాగా, ఈ టోర్నీలో టీమ్‌ఇండియా, ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఘనంగా బోణీ కొట్టింది. మరోవైపు పాకిస్థాన్ అనూహ్యంగా యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయింది.
దీంతో పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతింది. మరోవైపు తొలి మ్యాచ్‌లోనే నెగ్గిన భారత్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే 2008 నుంచి పాక్- భారత్ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీ పడుతున్నాయి. కాగా, 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్- పాకిస్థాన్ ఇప్పటిదాకా అనేకసార్లు తలపడ్డాయి. మరి ఈ దాయాదుల పోరులో ఎవరిది పైచేయి, ఇరుజట్ల మధ్య గల చరిత్రను తెలుసుకుందాం.
భారత్‌దే పైచేయి:ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లలో పాక్- భారత్ 7 సార్లు తలపడ్డాయి. వీటిల్లో టూమ్ఇండియా ఏకంగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రారంభ టీ20 వరల్డ్‌కప్ (2007)లో మ్యాచ్ డ్రా అవ్వగా, బౌల్ అవుట్‌లో 3-0తో ఇండియా గెలిచింది.
- 2007 టీ20 ప్రపంచకప్:తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్ పాకిస్థాన్‌తో రెండుసార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అయింది. బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్‌ను గెలుచుకుంది. తర్వాత ఫైనల్స్‌లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది.
- 2012 టీ20 ప్రపంచకప్:2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ సూపర్ 8 స్టేజ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. భారత్ 8 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.
- 2014 టీ20 ప్రపంచకప్:2014 టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8లో భారత్, పాక్ ఢీకొన్నాయి. మరోసారి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఈజీ విక్టరీ అందుకుంది. అయితే భారత్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- 2016 టీ20 ప్రపంచకప్:2016 T20 ప్రపంచ కప్‌కి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. గ్రూప్ స్టేజ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో పాక్, భారత్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మరోసారి ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- 2021 టీ20 ప్రపంచకప్:టీ20 వరల్డ్ కప్‌లో 2021లో మొదటిసారి పాకిస్థాన్ గెలిచింది. బాబర్ అజామ్ కెప్టెన్సీలోని పాక్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది.
- 2022 టీ20 ప్రపంచకప్:2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కోహ్లి- పాండ్యా పార్ట్‌నర్‌షిప్ భారత్‌ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చింది. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉండగా, కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బాల్‌కి సిక్స్ కొట్టి ఇండియాకి ఘన విజయం అందించాడు.