IND VS NZ 3rd Test 3 changes :న్యూజిలాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెండు మ్యాచుల్లోనూ టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక మూడోది చివరి మ్యాచ్ ముంబయి వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి మొదలు కానుంది. ఇది పూర్తవ్వగానే మనోళ్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమవుతారు.
అయితే మూడో టెస్ట్ మ్యాచ్‌కు మరోసారి మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంగ్లీష్ స్పోర్ట్స్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. రెండో టెస్టులోనూ మూడు మార్పులతో(రాహుల్, కుల్‌దీప్, సిరాజ్ స్థానాల్లో గిల్, సుందర్, ఆకాశ్) బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఓటమి మాత్రం తప్పలేదు.
కనీసం చివరిదైన మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని అనుకుంటోంది టీమ్‌ఇండియా. ఇదే సమయంలో ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌ల కోసం మెయిన్ ప్లేయర్స్‌కు రెస్ట్ ఇవ్వాలని చూస్తోంది.
మళ్లీ సిరాజ్‌కు - మొదటి టెస్టులో అంతగా రాణించని సిరాజ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చివరి మ్యాచ్ కోసం మళ్లీ అతడిని తీసుకుంటారని సమాచారం. వర్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రెస్ట్ కల్పిస్తారట. ఆకాశ్ దీప్‌తో పాటు సిరాజ్ బౌలింగ్ దాడిని ప్రారంభించే అవకాశం ఉంటుందట. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి, బుమ్రాకు విశ్రాంతి నివ్వడం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్టుల్లో బుమ్రా 3 వికెట్లు తీయగా, సిరాజ్ ఒక టెస్టులో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.