తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా - కివీస్​తో రెండో టెస్ట్​ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

న్యూజిలాండ్​తో కీలక పోరుకు సిద్ధమైన టీమ్ ఇండియా

IND VS NZ 2nd Test Live updates
IND VS NZ 2nd Test Live updates (source IANS)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

IND VS NZ 2nd Test Live updates : న్యూజిలాండ్​తో కీలక పోరుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. పుణె వేదికగా రెండో టెస్టులో తలపడనుంది. ఈ క్రమంలో మ్యాచ్​కు ముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్‌ లేథమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ మరింత కష్టంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తుది జట్టులో టీమ్‌ఇండియా మూడు మార్పులు చేసి బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్‌ను పక్కన పెట్టి, స్పిన్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మొదటి టెస్టులో పెద్దగా రాణించని కేఎల్ రాహుల్, సిరాజ్‌కు బదులు, గిల్‌, ఆకాశ్‌ దీప్​కు అవకాశం ఇచ్చింది. కివీస్‌ కూడా ఒక మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీని పక్కన పెట్టి మిచెల్ సాంట్నర్‌ను జట్టులోకి ఆహ్వానించింది. పుణె పిచ్ స్పిన్‌కు అనుకూలమనే వార్తలు రావడంతో మిచెల్ శాంట్నర్‌ను తీసుకున్నారు.

మ్యాచ్​ ఎక్కడ చూడొచ్చంటే? -ఈ మ్యాచ్​ను టీవీలో స్పోర్ట్స్​ 18 ఛానల్​తో పాటు కలర్స్ సినీప్లెక్స్​లో చూడొచ్చు. జియో సినిమా ఓటీటీలో ఫ్రీగా రీజనల్ భాషల్లో వీక్షించొచ్చు.

తుది జట్లు

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్‌ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్‌ : టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్‌ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్‌ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియమ్‌ ఒరోర్కీ

కాగా, రీసెంట్​గా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుని మూల్యం చెల్లించుకుంది. తొలి ఇన్నింగ్స్​లో 46 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నా గెలవలేకపోయింది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడింది. ఇప్పుడు పుణె టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.

పుణెలో రివెంజ్​కు భారత్​ సిద్ధం!- కివీస్​తో రెండో టెస్ట్​ పిచ్ పరిస్థితేంటి? వర్షం ముప్పు ఉందా?

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: భారత్ జట్టు ఎంపికపై ఉత్కంఠ- వాళ్లకు ఛాన్స్ దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details