Ind vs Nz 1st Test 2024 :న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మూడో రోజు టీమ్ఇండియా పుంజుకుంది. శుక్రవారం ఆట ముగిసేసరికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 231-3 స్కోర్‌తో ఉంది. ప్రస్తుతం 125 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (70 పరుగులు) ఉన్నాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్లు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ (52 పరుగులు), విరాట్ కోహ్లీ ( 70 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హెన్రీ బౌలింగ్‌లో వరుసగా 4,6,4 బాది హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఊపులో ఉన్న రోహిత్ తర్వాతి ఓవర్ల అజాజ్ పటేల్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔటయ్యాడు. అజాజ్ వేసిన బంతిని రోహిత్ పర్ఫెక్ట్గా డిఫెన్స్ చేసినప్పటికీ అది బ్యాట్, ప్యాడ్స్ మధ్యలోనుంచి వెళ్లి వికెట్లకు తగిలింది. ఇక యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (35 పరుగులు) కూడా ఫర్వాలేదనిపించాడు.
విరాట్- సర్ఫరాజ్
రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌తో విరాట్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు విరాట్- సర్ఫరాజ్ 136 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇక గ్లెన్ ఫిలిప్ బౌలింగ్‌లో విరాట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.