తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో టెస్ట్​ సిరీస్‌ - రోహిత్‌ శర్మను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు

రోహిత్‌ శర్మ ముంగిట ఐదు రికార్డులు - బ్రేక్ చేస్తే మోస్ట్ సక్సెస్​ఫుల్​ కెప్టెన్​గా ఘనత!

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

IND VS Newzealand Test Series Rohith Sharma
IND VS Newzealand Test Series Rohith Sharma (source Associated Press)

IND VS Newzealand Test Series Rohith Sharma Records : ఇటీవలే బంగ్లాదేశ్​పై సిరీస్​ దక్కించుకుని జోరు మీదున్న టీమ్ ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. మరో రోజులో (అక్టోబర్ 16)​ న్యూజిలాండ్​తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు రెడీగా ఉంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు (అక్టోబర్‌ 24-28) పుణెలో, మూడో టెస్టు (నవంబర్‌ 01-05) ముంబయిలో జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి. వాటిని హిట్ మ్యాన్​ బ్రేక్ చేసే అవకాశముంది. ఇంతకీ అవేంటంటే?

టెస్ట్​లో అత్యధిక సిక్సర్లు - రోహిత్‌ శర్మ మరో ఐదు సిక్స్‌లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత జట్టు ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఈ లిస్ట్​లో వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్స్‌లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

రెండు WTC సైకిల్స్​లోనూ 1000కుపైగా రన్స్​ - రెండు డబ్ల్యూటీసీల్లోనూ 1000కిపైగా పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా రోహిత్​ రికార్డుకెక్కే అవకాశం ఉంది. హిట్ మ్యాన్​ 2019-21లో 1094 పరుగులు చేశాడు. 2023-25 డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 742 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. మరో 258 పరుగులు చేస్తే వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నట్టవుతుంది.

WTCలో టీమ్​ ఇండియా మోస్ట్​ సక్సెస్​ఫుల్​ కెప్టెన్​గా - న్యూజిలాండ్​తో ఈ టెస్ట్​ సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో దక్కించుకుకుంటే, డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీమ్​ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ ఘనత సాధిస్తాడు. 2019 - 2022 మధ్య మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 22 డబ్ల్యూటీసీ మ్యాచ్​లకు సారథ్యం వహించాడు. అందులో భారత జట్టుకు 14 విజయాలను అందించాడు. రోహిత్ ఇప్పటివరకు 18 మ్యాచ్​లకు సారథ్యం వహించి 12 విజయాలను జట్టుకు అందించాడు. ఇప్పుడు న్యూజిలాండ్​ సిరీస్‌లోని మూడు మ్యాచులను భారత జట్టు 3-0తో విజయం సాధిస్తే కోహ్లీని రోహిత్‌ అధిగమిస్తాడు.

టెస్ట్​ల్లో 4వ భారత మోస్ట్​ సక్సెస్​ఫుల్​గా కెప్టెన్​గా -ఇప్పుడు కివీస్​పై మూడు టెస్టుల్లోనూ భారత జట్టు విజయం సాధిస్తే టెస్టుల్లో టీమ్ ఇండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడు. తద్వారా అజహరుద్దీన్‌(14 విజయాలు, 47 మ్యాచ్‌లు) రికార్డ్​ను బ్రేక్ చేస్తాడు. అజారుద్దీన్ 1990 నుంచి 1997 వరకు టెస్టుల్లో 47 మ్యాచులకు​ టీమ్​ఇండియాకు సారథ్యం వహించాడు. అందులో 14 సార్లు విజయం సాధించాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (12 విజయాలు, 18 మ్యాచ్‌లు) కొనసాగుతున్నాడు.

4వ మోస్ట్​ సక్సెస్​ఫుల్​గా ఇండియన్​ కెప్టెన్​గా - ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే కెప్టెన్‌గా సౌరభ్ గంగూలీ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్​లో టీమ్ ఇండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా నిలుస్తాడు. గంగూలీ (97 విజయాలు, 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు) నాలుగో స్థానంగా కొనసాగుతుండగా, రోహిత్‌ (95 విజయాలు, 128 మ్యాచ్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు.

మహిళా క్రికెటర్లలో ఈ కెప్టెన్​ చాలా రిచ్! - హర్మన్​ప్రీత్ నెట్​వర్త్ ఎంతంటే?

పాకిస్థాన్​ జట్టు ఘోర పరాజయాలు! - ఆ మూడు విషయాలే కారణం!

ABOUT THE AUTHOR

...view details