Ind vs Eng Test Yashasvi Gill Century: ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాలతో అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ డబుల్ సెంచరీ (209)తో రప్ఫాడించగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీతో కదంతొక్కాడు. వీరిద్దరు కూడా టీమ్ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే జట్టును ఆదుకోవడం విశేషం. దీంతో ఈ యంగ్ టాలెండెట్ ప్లేయర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ ఈ ఇద్దర్ని ప్రశంసించాడు.
'25 ఏళ్లు కూడా నిండని ఈ ఇద్దరు కుర్రాళ్లు జట్టుకు అవసరమైనప్పుడు బలంగా నిలబడ్డారు. వారి పెర్ఫార్మెన్స్ పట్ల చాలా సంతోషంగా ఉంది. రానున్న దశాబ్దంపాటు వీళ్లూ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తారు' అని సెహ్వాగ్ అన్నాడు. మరోవైపు సచిన్ కూడా ఈ యంగ్ బ్యాటర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. 'వెల్ డన్ యశస్వి, విజయీభవ' అని డబుల్ సెంచరీ సాధించిన జైశ్వాల్‌ను ప్రశంసించాడు. తాజాగా గిల్ సెంచరీపై కూడా స్పందించాడు. 'పూర్తి నైపుణ్యాలతో శుభ్‌మన్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. సరైన సమయంలో సెంచరీ సాధించావు. కంగ్రాట్స్' అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ షేర్ చేశాడు.