IND VS ENG Fourht Test Yashasvi Jaiswal : టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. తద్వారా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును యశస్వీ సమం చేసిన ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తోనే ఈ సూపర్ ఫీట్‌ను నమోదు చేశాడు యశస్వి.
Yashasvi Jaiswal England Test Runs :ప్రస్తుతం నాలుగో టెస్టులో యశస్ తొలి ఇన్నింగ్స్‌లో 73, రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో కలిపి 655 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2016లో కోహ్లీ ఇంగ్లాండ్‌పై ఒకే సిరీస్‌లో 655 పరుగుల ఫీట్ నమోదు చేశాడు. అయితే ప్రస్తుత సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే యశస్వి విరాట్ రికార్డ్‌ను సమం చేశాడు. అంటే మరో మ్యాచ్‌లో ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాగా, ఈ సిరీస్ ఆసాంతం తన బ్యాట్‌తో అదరగొడుతున్న జైశ్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదాడు. అలా ప్రస్తుత సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న అతడు మరో ఘనతను కూడా ఖాతాలో వేసుకున్నాడు. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో 600పైగా పరుగులు చేసిన టీమ్ ఇండియా తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గానూ రికార్డుకు ఎక్కాడు. మొత్తంగా ఒక టెస్ట్ సిరీస్‌లో 600 పైగా పరుగులు చేసిన ఐదో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.