Ind Vs Eng 2024 Test Series : టీమ్ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. గేమ్ ముగిసే సమయానికి ఇండియా 23 ఓవర్లు ఆడి తొలి వికెట్‌కు 119 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(70 బంతుల్లో 76 ; 9x4, 3x6) దూకుడు ఆడాడు. శుభమన్ గిల్(14) క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ(27 బంతుల్లో 24; 3x4) ఔట్ అయ్యాడు. రోహిత్‌ను జాక్ లీచ్ ఔట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 చేసి ఆలౌట్ అయింది. కాగా, తొలి బంతి నుంచే యశస్వి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతడిని కట్టడి చేయడం ఇంగ్లాండ్ బౌలర్లకు కష్టామైంది. భారత్ ఇంకా 127 పరుగులు మాత్రమే వెనకపడి ఉంది. ఇకపోతే ఇప్పటికే ఇంగ్లాండ్ మూడు డీఆర్‌ఎస్‌లను వినియోగించుకోవడం గమనార్హం. అవన్నీ వృథా కావడం వల్ల ఆ జట్టు ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు.
రోహిత్ అంత తొందర ఎందుకు? : రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరును కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. స్కోర్ బోర్డు బాగానే ఉన్నప్పటికీ భారీ షాట్ ప్రయత్నించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇదేమి వైట్ బాల్ క్రికెట్ కాదు కాదా, అంత తొందర ఎందుకుని నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ మొదటి వికెట్‌కు జైశ్వాల్‌తో కలిపి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం తొలి 12 ఓవర్లలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్( 76), శుభమన్ గిల్(14) క్రీజులో కొనసాగుతున్నారు.