IND vs BAN Sanju Samson :బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ దక్కించుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు గ్వాలియర్ స్టేడియం వేదిక కానుంది. మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. సూర్యతోపాటు 15మందితో కూడిన జట్టను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్ (అభిషేక్ శర్మ) మాత్రమే ఉండడం గమనార్హం. అయితే అతడితోపాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించేది ఎవరా అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
అయితే అభిషేక్‌తో పాటు సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడం, ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడం వంటి కారణాలతో సంజూకి అవకాశం దక్కింది. అయితే ఒకవేళ అతడికే ఓపెనర్‌గా ఛాన్స్ వస్తే మాత్రం అరుదైన ఘనతను అతడి ఖాతాలోకి వచ్చి చేరుతుంది.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంజు, ఇప్పటి వరకు 30 టీ20లకు మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఇలా బరిలోకి దిగడం ఇదే మొదటి సారి. అంటే మొత్తంగా 9 ఏళ్ల కెరీర్లో ఓపెనర్‌గా, వికెట్కీవర్గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి అవుతుందన్న మాట.
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 | అక్టోబర్ 06 | గ్వాలియర్ |
రెండో టీ20 | అక్టోబర్ 09 | న్యూ దిల్లీ |
మూడో టీ20 | అక్టోబర్ 12 | హైదరాబాద్ |