High Court Inquiry on Encroachment of Ponds and FTL Determination : హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు, ఎఫ్టీఎస్ నిర్ధరణ అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్ సంబంధించిన వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది, ఇప్పటివరకు 700 పైగా చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. మిగతా చెరువుల తుది నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు తెలిపారు. సుమోటో పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
హైదరాబాద్ నగరంలోని చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే : హైకోర్టు
హైకోర్టు నిరాకరణ : హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధరణపై చేపట్టిన విచారణలో 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ తెలిపారు. 530 చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లు వివరించారు. కాగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీకి మూడు నెలల సమయం కావాలని నవంబరులో ప్రభుత్వ న్యాయవాది కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దానిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.