ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలకు గుడ్​న్యూస్​ - ఇకపై ప్రతి సమాచారం సెల్​ఫోన్​లోనే - JANMANREGA APP FOR MGNREGS

ఉపాధి హమీ కూలీల కోసం జన్​మన్​నరేగా యాప్​ - చేతుల్లోనే అన్ని వివరాలు - ఇక అక్రమాలకు అడ్డుకట్ట

Central Government Launched Janmanrega App For MGNREGS
Central Government Launched Janmanrega App For MGNREGS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 7:04 PM IST

Central Government Launched Janmanrega App For MGNREGS : జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలందరికి ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తున్నారు. పారదర్శకత పెంచి అక్రమాలకు తావివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకొస్తున్నాయి. కూలీల వేతనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడికి బ్యాంకు, పోస్టాఫీస్​ ఖాతాలు తెరిచి నేరుగా చెల్లిస్తున్నారు. ఒకరికే రెండు మూడు ఖాతాలు ఉండడంతో ఎందులో జమ చేశారో తెలుసుకోవడంతో ఇబ్బందులు ఎదురవ్వుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా జన్​మన్​ నరేగా యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

  • ప్లేస్టోర్​ నుంచి జన్​మన్​ నరేగా యాప్​ను డౌస్​లోడ్​ చేసుకోవచ్చు
  • ఈ యాప్​లో కూలీల వేతనాలు, పని దినాలకు సంబంధించిన ఆప్షన్​ను ఎంపిక చేసుకోవాలి
  • రాష్ట్ర, జిల్లా, మండలం, పంచాయతీ, కుటుంబం ఐడీ వివరాలన్ని యాప్​లో నమోదు చేయాలి
  • పేమెంట్​ ఆప్శన్​లోకి వెళ్లి వ్యక్తి పేరు మీద క్లిక్​ చేస్తే ఎక్కడ పని చేశారు, ఎన్ని రోజులు పని చేశారు, ఎంత వేతనం, ఎప్పుడు జమ చేశారు, ఏ బ్యాంకులో వేశారో అన్ని వివరాలు ఉంటాయి.

బ్యాంకు ఖాతాల్లోకి ఉపాధి హామీ చెల్లింపులు- ఆధార్​తో లింక్ ఉంటేనే పేమెంట్!

ఒకవేళ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి : ఉపాధి హామీ డబ్బులు జమ కాకుంటే సదరు లబ్ధిదారుడి ఖాతాకు సంబంధించి ఆధార్​ లింక్​ అయిందా అన్నది చెక్​ చేయాలి. ఆధార్​లో పోలీన విధంగా బ్యాంకు వివరాలు ఉన్నాయా, ఆధార్​ బ్రిడ్జ్​ పేమెంట్​ సిస్టం (ఏబీపీఎస్​) లింక్ అయిందో లేదో వివరాలు యాప్​లో ఉంటాయి. ఒకవేళ అన్ని లింకై ఉంటే అక్కడ పచ్చరంగులో రైట్​గుర్తు ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్ అయితే, ఏది లేదో దానికి ఎరుపు రంగులో తప్పు గుర్తు ఉంటుంది. జాబ్​కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే అటెండెన్స్​ ఆప్షన్​ ఎంపిక చేసుకోవాలి. ఈ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు పని చేశారు. ఎవరెవరు ఎన్ని రోజులు పనిచేశారో వివరాలు పూర్తిగా కనిపిస్తాయి.

ఉపాధి కూలీల వేతనాల చెల్లింపుల్లో అక్రమాలు జరగొద్దని కేంద్ర ప్రభుత్వం తాజాగా 'జన్​మన్​నరే'గా యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కూలీలు తమ వివరాలు అందులో తెలుసుకోవచ్చు. సాంకేతికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలు తీసుకుస్తోంది.

Harish on MGNREGS: 'ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది'

తెలంగాణలో కరవు - 'ఉపాధి'కి భరోసా కల్పించేది ఎలా? - drought Situation in Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.