తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేనైతే అలా అనుకోవట్లేదు'- U 19 భారత్​ కెప్టెన్ ఉదయ్ ఇంట్రెస్టింగ్ రిప్లై - This Is Not Revenge Uday Saharan

Ind vs Aus U19 Final 2024: అండర్​-19 ప్రపంచ కప్ తుదిపోరు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏడాదిలో రెండుసార్లు ఐసీసీ ఈవెంట్​ ఫైనల్స్​లో భంగపడ్డ భారత్ ఈసారి ఎలాగైనా ఆసీస్​ను దెబ్బకొట్టాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి దీనిపై కెప్టెన్ ఉదయ్ ఏమన్నాడంటే?

Uday Saharan Comments On U-19 World Cup
Uday Saharan Comments On U-19 World Cup

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 1:25 PM IST

Updated : Feb 11, 2024, 3:33 PM IST

Ind vs Aus U19 Final 2024: ఏడాది కాలంలో జరిగిన రెండు ఐసీీసీ ఈవెంట్​ ఫైనల్స్​లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. ఈ రెండింట్లోనూ (డబ్ల్యూటీసీ​​, వన్డే ప్రపంచకప్) ఓటములను చవిచూసింది భారత్​. ప్రస్తుతం జరుగుతున్న 2024 అండర్​-19 ఫైనల్​లోనూ యువ భారత్​ ఆదివారం అదే ఆసీస్​ను​ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో బెనోనీలోని విల్లోమూర్​ పార్క్​ మైదానంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్​ కాన్ఫరెన్స్​లో టీమ్​ఇండియా సారథి ఉదయ్​ సహరన్ మాట్లాడాడు. ఈ చిట్​చాట్​ కార్యక్రమంలో జట్టు విజయంపై ఓ కీలక వ్యాఖ్యలు చేశాడు.

మీరు ఈ మ్యాచ్​ను రివెంజ్​లా భావిస్తున్నారా?
అండర్​-19 ప్రపంచకప్​ను మన ఆటగాళ్లు గత వన్డే ప్రపంచకప్​ ఓటమికి ఓ రివెంజ్​ మ్యాచ్​లా తీసుకొని ఆడాలని కోరుకుంటున్నారు క్రికెట్​ లవర్స్​. ఇప్పటికే సీనియర్ల టోర్నమెంట్లైన 2023 డబ్ల్యూటీసీ ఛాంపియన్​షిప్​​​, 2023 వన్డే వరల్డ్​కప్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది భారత్​. ఇప్పుడు మరో మెగా టోర్నీకి రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్​ను మీరు 2023 ప్రపంచకప్​ ఓటమికి కంగారులపై రివెంజ్​లా భావిస్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఉదయ్​. 'అలాంటిదేమీ లేదు, దీన్ని మేం ప్రతికార మ్యాచ్​గా అస్సలు భావించట్లేదు' అని రియల్ స్పోర్ట్​మన్​షిప్​లా బదులిచ్చాడు. ఇది విన్న ఫ్యాన్స్ కెప్టెన్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్​లో గెలుపు సాధించాలంటూ ఆల్​ ద బెస్ట్ చెబుతున్నారు.

అంతకుముందు ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్​ మ్యాచుల్లో భారత్​, ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికాపై భారత్​ 2 వికెట్ల తేడాతో గెలుపొందగా ఆస్ట్రేలియా దాయాది దేశం పాక్​పై 1 వికెట్​ తేడాతో గెలుపొందింది. దీంతో భారత్ తొమ్మిదోసారి ఫైనల్​కు దూసుకొచ్చింది. కాగా, ఇరుజట్ల మధ్య ఇది మూడో అండర్-19 ఫైనల్ మ్యాచ్. ఈ టోర్నీలో భారత కెప్టెన్​ ఉదయ్​ సహరన్ ​64 సగటుతో 389 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన లిస్ట్​లో టాప్​లో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో టాప్​-3లో టీమ్ఇండియా బ్యాటర్లే ఉండడం విశేషం.

U 19 ఫైనల్స్​లో 'యువ భారత్' ట్రాక్ రికార్డ్​

మరోసారి కప్​పై కన్ను- భారత్‌ Vs ఆసీస్‌- పై చేయి ఎవరిదో ?

Last Updated : Feb 11, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details