Champions Trophy 2025 Schedule : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పీసీబీ పంపించింది. కానీ దీనికి బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకే బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకుంటారు.
అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదలైనట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఏడు లాహోర్‌లో జరగగా మూడు కరాచీలో, ఐదు రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్ డిజైన్ చేశారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న లాహోర్‌లో జరగనున్నట్లు ఇందులో ఉంది. సెమీ ఫైనల్స్‌కు కరాచీ, రావల్పిండి వేదికలుగా, ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇకపోతే ఇక్కడి స్టేడియాలను కూడా ఆధునికరించనున్నారు. వీటి కోసం పీసీబీ 17 బిలియన్లు కేటాయించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రతిపాదిత షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 19:న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - కరాచీ
- ఫిబ్రవరి 20:బంగ్లాదేశ్ vs భారత్ - లాహోర్
- ఫిబ్రవరి 21:అఫ్గానిస్థాన్ vs దక్షిణాఫ్రికా - కరాచీ
- ఫిబ్రవరి 22:ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - లాహోర్
- ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్ - లాహోర్
- ఫిబ్రవరి 24:పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - రావల్పిండి
- ఫిబ్రవరి 25: అఫ్గానిస్థాన్ vs ఇంగ్లాండ్ - లాహోర్
- ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - రావల్పిండి
- ఫిబ్రవరి 27:బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ - లాహోర్
- ఫిబ్రవరి 28:అఫ్గానిస్థాన్ vs ఆస్ట్రేలియా - రావల్పిండి
- మార్చి 1: పాకిస్థాన్ vs భారత్ - లాహోర్
- మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ - రావల్పిండి
- మార్చి 5:సెమీ-ఫైనల్ - కరాచీ
- మార్చి 6: సెమీ-ఫైనల్ - రావల్పిండి
- మార్చి 9: ఫైనల్ - లాహోర్
గ్రూప్ ఎ - టీమ్ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్