ICC Womens T20 World Cup :ప్రతిష్టాత్మకఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అలాగే జట్టు సభ్యులను ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకూ జరగనుంది. 15 మందితో కూడిన మహిళల జట్టు ఈ టోర్నీలో పాల్గొననుండగా, వికెట్‌కీపర్ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్ శ్రేయంకా పాటిల్ మాత్రం ఫిట్‌నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్తారు. ఇక తనుజా కన్వర్, ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.
వేదికలో మార్పు అందుకే
అయితే ఈ ప్రపంచ కప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ, అక్కడ జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఈ టోర్నీని యూఏఈకి షిఫ్ట్ చేసింది ఐసీసీ. ఇక మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడనుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్ బరిలో దిగుతాయి.
ఇక గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా, గ్రూప్ Bలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ టీమ్స్ ఉన్నాయి.
భారత్ షెడ్యూల్ ఇదే
అక్టోబర్ 4న భారత్ x న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మహిళల జట్లు తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ అక్టోబర్ 6న దుబాయ్‌లో ఆడనున్నారు.