తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​ రిలీజ్​ - కేన్ మామనే టాప్​ - రోహిత్, కోహ్లీ పొజిషన్ ఏంటంటే ? - ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలర్​

ICC Test Rankings 2024 : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ తాజాగా విడుదలైంది. ఇందులో భాగంగా టాప్​ పొజిషన్​లో ఎవరెవరున్నారంటే ?

ICC Test Rankings 2024
ICC Test Rankings 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 6:57 PM IST

ICC Test Rankings 2024 :ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ తాజాగా విడుదలైంది. అందులో తాజాగా బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు ఆల్​రౌండర్ పర్ఫామెన్స్​తో అదరగొట్టిన ప్లేయర్లకు ఐసీసీ ర్యాంక్స్​ నిర్దేశించింది.​ ఈ నేపథ్యంలో పలువురు ప్లేయర్లు తమ ర్యాంకింగ్స్​ను మెరుగుపరుచుకుని దూసుకెళ్లారు.

ఉప్పల్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్​ ఒలీ పోప్ 20 స్థానాలు ఎగ‌బాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో అర్థ సెంచరీతో చెలరేగిపోయిన ఉస్మాన్ ఖ‌వాజా ఈ సారి 2 స్థానాలు ఎగ‌బాకి ఎనిమిదో స్థానాని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్ మాత్రం టాప్ వన్ ర్యాంకర్​గా కొనసాగుతున్నాడు.

ఇక భార‌త ఆట‌గాళ్లలో టీమ్ఇండియా రన్నింగ్ మెషిన్​ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే టాప్‌-10లో భారత్​ నుంచి కోహ్లీ మాత్రమే ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 12, రిషబ్​ పంత్​ పంత్ 13వ స్థానాలను సాధించారు.

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5 ప్లేయర్స్ :

1.కేన్‌ విలియమ్సన్ (న్యూజిలాండ్‌) – 864 రేటింగ్ పాయింట్లు

2.జో రూట్ (ఇంగ్లండ్‌) – 832

3.స్టీవ్‌ స్మిత్ (ఆస్ట్రేలియా) – 818

4.డారిల్‌ మిచెల్ (న్యూజిలాండ్‌) – 786

5.బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌) – 768

మరోవైపు టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్‌లో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఈ స్టార్​ స్పిన్నర్​. 853 రేటింగ్ పాయింట్లతో నెంబర్​ వన్​గా కొనసాగుతున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. ర‌వీంద్ర జ‌డేజా ఆరో స్థానంలో ఉన్నాడు.

టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్​లో టాప్‌-5 వీరే :

1.రవిచంద్రన్‌ అశ్విన్ (ఇండియా) – 853 రేటింగ్ పాయింట్లు

2.కగిసో రబడ (సౌతాఫ్రికా) – 851

3.పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 828

4.జస్‌ప్రీత్‌ బుమ్రా (భార‌త్‌) – 825

5.జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 818

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్​లో టాప్ -5 ప్లేయర్స్ :

1.రవీంద్ర జడేజా (భార‌త్‌) – 425 పాయింట్లు

2.రవిచంద్రన్‌ అశ్విన్ (భార‌త్‌) – 328

3.షకీబ్‌ అల్‌హసన్ (బంగ్లాదేశ్‌) – 320

4.జో రూట్ (ఇంగ్లాండ్‌) – 313

5.బెన్‌ స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – 307

బాబర్​దే అగ్రస్థానం- మళ్లీ టాప్​లోకి పాక్ బ్యాటర్- టీ20 నెం.1 బౌలర్​గా రషీద్

ICC Rankings : టీమ్ఇండియా ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్.. ఐసీసీ ర్యాంకింగ్స్​లో మనోళ్లదే డామినేషన్!

ABOUT THE AUTHOR

...view details