2025 Champions Trophy Schedule :క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఐసీసీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో టోర్నీ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. మార్చి 09న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సెమీ ఫైనల్, ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఇక ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే, తుదిపోరు దుబాయ్ వేదికగా జరగనుంది. లేదంటే మ్యాచ్ లాహోర్‌లో ఉంటుంది.
టోర్నీలో పాల్గొనే ఎమినిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా, గ్రూప్ బీ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. కాగా, టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
టోర్నీలో భారత్ పూర్తి మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 20 : భారత్ - బంగ్లాదేశ్- దుబాయ్
- ఫిబ్రవరి 23 : భారత్- పాకిస్థాన్- దుబాయ్
- మార్చి 2 : న్యూజిలాండ్ - భారత్ - దుబాయ్
మ్యాచ్‌ల వేదికలు ఇవే
- లాహోర్
- కరాచీ
- రావల్పిండి
- దుబాయ్